పూరి జగన్నాథ్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది.పూరి సినిమా అంటే కనీసం కథ కూడా వినకుండానే రవితేజ ఒకే చేసేస్తాడు.
వీరిద్దరి కాంబినేషన్ లో ఐదు సినిమాలు వస్తే అందులో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్.అలాగే రవితేజని పూర్తి స్థాయిలో హీరోగా నిలబెట్టింది కూడా పూరి జగన్నాథ్ అని చెప్పాలి.
ఇట్లుశ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి సినిమాలు రవితేజ హీరో ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి.ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోగా తన హవాని కొనసాగిస్తున్నాడు.
వాటి తర్వాత వీరి కాంబినేషన్ లో నేనింతే, దేవుడు చేసిన మనుషులు సినిమాలు వచ్చాయి వీటిలో ఒకటి ఏవరేజ్ టాక్ తో బయటపడగా, ఇంకోటి డిజాస్టర్ అయ్యింది.ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ వీరిద్దరూ మరో సినిమా చేయలేదు.
తొమ్మిదేళ్ల తర్వాత మరల పూరి జగన్నాథ్ రవితేజతో సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

రవితేజ కోసం పూరి జగన్నాథ్ ఒక కథ కూడా సిద్ధం చేసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరి ‘లైగర్’ సినిమా చేస్తుండగా రమేశ్ వర్మతో రవితేజ ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు.ఈ రెండు ప్రాజక్టులు పూర్తయ్యాక వీరిద్దరి కలయికలో సినిమా సెట్స్ కి వెళుతుందని సమాచారం.
ఇక ఈ సినిమా పూరి, ఛార్మి సొంత ప్రొడక్షన్ లో ఉంటుందా లేదంటే వేరొక ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కిస్తారా అనేది చూడాలి.ఎందుకంటే పూరీ కనెక్ట్స మీద లైగర్ తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలే ఉంటాయని ఛార్మి క్లారిటీ ఇచ్చింది.
మరి రవితేజతో పూరి పాన్ ఇండియా ప్లాన్ చేస్తాడా లేక ఒక తెలుగులో ప్లాన్ చేస్తాడా అనేది వేచి చూడాలి.