ట్రంప్ సీఎన్‌ఎన్ మీడియా జర్నలిస్ట్ పై చిందులు వేశారు.వైట్ హౌస్ నుంచీ అతడిని శాశ్వతంగా పాస్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అతడిని ఇక్కడికి మరో సారి రావద్దని హెచ్చరించారు.
అసలు ట్రంప్ ఇలాంటి చర్యకి పాల్పడటానికి కారణం ఏమయ్యి ఉంటుంది అంటే.అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.రిపబ్లికన్లు కాంగ్రెస్‌లోని ఎగువసభ అయిన సెనెట్లో పట్టు సాధించగా డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అధిక స్థానాలను సాధించారు…అయితే
ఈ ఫలితాల తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించాడు…ఈ సందర్భంలో వలసలకు వ్యతిరేకంగా ట్రంప్ చేసే ప్రకటనలు జాత్యాహంకారానికి చిహ్నంగా ఉన్నాయని సీఎన్‌ఎన్ జర్నలిస్టు జిమ్ ప్రశ్నించగా ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో నాన్ని అమెరికాని పాలించనివ్వండి మీరు మీ చానెల్ నడుపుకోండి అంటూ ఫైర్ అయ్యారు జిమ్ అకోస్టా ప్రెస్ పాస్‌ను రద్దు చేశాడు.దాంతో వైట్‌హౌస్‌కు జిమ్ అకొస్టా అనుమతిని వైట్‌హౌస్ నిరాకరించింది.
తాజా వార్తలు