ప్రస్తుతం టాలీవుడ్ లో పలు క్రేజీ కాంబోలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ క్రేజీ కాంబినేషన్స్ ఆడియెన్స్ లో ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి.
వీటి కోసం ఫ్యాన్స్ కూడా తెగ ఎదురు చూస్తున్నారు.మేకర్స్ ప్రేక్షకుల కోసం సరికొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేసారు.
దీంతో కొత్త కంబోనేషన్స్ ను సెట్ చేసే ప్రయత్నాలు జరుగు తున్నాయి.తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ కాంబో తెరపైకి వచ్చింది.
టాలీవుడ్ మేకర్స్ ఈ ఇంట్రెస్టింగ్ కాంబోను సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇంతకీ ఆ కాంబో ఏంటి అంటే.
మంచు విష్ణు ( Manchu Vishnu ) ఏ సినిమా చేసిన ప్లాప్ అవుతూనే ఉంది.అయినప్పటికీ పట్టువదలకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఇక జిన్నా</em వంటి ప్లాప్ తర్వాత కొద్దీ గ్యాప్ తో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”భక్త కన్నప్ప” ( Bhakta Kannappa ).ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.
ఎప్పటి నుండో అనుకుంటున్న కూడా ఈ సినిమా మాత్రం పట్టాలెక్కలేక పోయింది.కానీ ఎట్టకేలకు ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.ఇందులో ప్రభాస్ కీ రోల్ పోషిస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.విష్ణు ‘హరహర మహాదేవ’ అంటూ పోస్ట్ చేయడంతో ప్రభాస్ ఉంటాడు అనే విషయం కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) ఒక వైపు భారీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటే మళ్ళీ ఈ సినిమాలో క్యామియో రోల్ కూడా చేసేందుకు ఒప్పుకున్నాడు అనేది ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ గా అనిపిస్తుంది.మోహన్ బాబు ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ రోజు చెప్పినట్టు ఊహించని వారు ఉంటారు అనే మాటలు దీంతో నిజమయ్యాయి అనే చెప్పాలి.మొత్తానికి డార్లింగ్ ఉన్నాడు అనే టాక్ తో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది.
మరి ప్రభాస్ శివుడి ( Lord Shiva ) పాత్రలో కనిపిస్తాడు అనే టాక్ వినిపిస్తుంది.ఇదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవల్ కు చేరిపోవడం ఖాయం.