ఒక్క సినిమాకు ఐదు కోట్లు, స్టాఫ్ కి కోటి.. హ్యాట్రిక్ ఫ్లాపులు వచ్చినా.. పూజా రెచ్చిపోతోంది? 

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.ఈ సామెతను పెద్దలు ఏ ముహూర్తాన చెప్పారో కానీ నేటి తరం హీరోయిన్లు మాత్రం తూచ తప్పకుండా ఫాలో అవుతున్నారు.

 Pooja Hedge Demand For Huge Remuneration Details, Pooja Hegde, Heroine Pooja Heg-TeluguStop.com

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం కాదు ఏకంగా కొత్త ఇల్లు కట్టుకునేంతగా పక్కా ప్లాన్ తో ప్రస్తుతం ముందుకు సాగుతున్నారు నేటి రోజుల్లో హీరోయిన్లు.సక్సెస్ వచ్చిందంటే చాలు పారితోషికాన్ని పెంచేస్తూ నిర్మాతలకు షాక్ ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటివరకూ విజయాలు సాధిస్తూ ఉంటే హీరోయిన్ల పారితోషికం పెంచడం చూసాము.

కానీ ఇక్కడ మాత్రం వరుసగా ఫ్లాపులు మూటగట్టుకున్న హీరోయిన్ సైతం పారితోషికం పెంచడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అనే చెప్పాలి.

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే మొన్నటి వరకు వరుస విజయాలు సాధించింది.కానీ ఇటీవలే రాధేశ్యాం, బీస్ట్, ఆచార్య లాంటి 3 బిగ్గెస్ట్ ఫ్లాప్ లను ఖాతాలో వేసుకుంది.

దీంతో ఈ అమ్మడు పారితోషికం తగ్గిస్తుందని అవకాశాలు తగ్గిపోతాయని అనుకున్నారు అందరు.కానీ ఈ అమ్మడు మాత్రం పారితోషకం తగ్గించడం కాదు తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది అన్నది తెలుస్తుంది.

Telugu Puri Jagannath, Crore Rupees, Pooja Hegde, Janaganamana, Pooja Hedge, Poo

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.ఇక ఈ సినిమా కోసం ఏకంగా 5 కోట్ల ఛార్జ్ చేస్తోందట పూజ.ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది అని చెప్పాలి.వరుసగా మూడు డిజాస్టర్ లను కొట్టిన హీరోయిన్ కి ఇంత డిమాండ్ ఏంటో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక పూజా హెగ్డే డిమాండ్ చేసిన ఐదు కోట్లు లో నాలుగు కోట్లు పూజా హెగ్డే కి ఒక కోటి రూపాయలు ఆమె సిబ్బందికి అని తెలుస్తోంది.

ఇక నిర్మాతలు కూడా ఈ అమ్మడు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube