స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఈ మద్య నటి ప్రగతి కనిపిస్తున్న విషయం తెల్సిందే.హీరోలకు తల్లిగా లేదా హీరోయిన్స్‌కు తల్లి పాత్రల్లో ఈమె కనిపిస్తూ వస్తున్నారు.
ఈమె కొన్ని సినిమాల్లో కమెడియన్‌గా కూడా నవ్వించారు.తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకుని మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు దక్కించుకున్న ప్రగతి సినిమాల్లో నాలుగు.
అయిదు పదుల వయసు ఉన్న పాత్రల్లో నటిస్తుంది.కాని ఆమె వయసు ప్రస్తుతం మూడు పదులే అంటూ ఆమె సన్నిహితులు అంటున్నారు.
హీరోయిన్స్ వయసు అంత కూడా లేని ఆమె కొన్ని కారణాల వల్ల తల్లి పాత్రలు చేస్తూ వస్తుంది.హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తల్లి పాత్రలు రావడంతో ఏవైతే ఏముంది చేద్దాం అనుకుంది.
అవే మంచి గుర్తింపు తీసుకు రావడంతో అలాగే కంటిన్యూ అవుతుంది.ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని ఫొటోలు ఈమె హీరోయిన్‌గా చేస్తే బాగుండు కదా అనుకునేలా ఉంటాయి.
ఈ చీరలోని పిక్‌తో ప్రస్తుతం నెటిజన్స్‌ను ఈమె పిచెక్కిస్తోంది.టాటూతో పాటు బ్యాక్ చూపిస్తూ ప్రగతి ఇచ్చిన ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అందుకే మీరు ఇంత హాటా ఆంటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.