టాలీవుడ్ లో ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి చిత్రం సైరా నరసింహారెడ్డి.అప్పట్లో స్వతంత్రం కోసం పోరాడిన టువంటి సైరా నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించి తెరకెక్కించారు.
అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మెగాస్టార్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మించారు.
అయితే సైరా విషయంలో జరిగినటువంటి తప్పిదాన్ని మళ్లీ ఇంకోసారి పునరావృతం కాకుండా మెగాస్టార్ చిరంజీవి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న టువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
అయితే ఈ చిత్రం కథాంశం గురించి పలు వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.ఈ చిత్రం రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బట్టి తెరకెక్కిస్తున్నారని, అంతేగాక ఈ చిత్రంలో మెగాస్టార్ కి ప్రత్యర్థి పాత్రలో టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తున్నారని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అంతేగాక వీళ్లిద్దరికీ సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఇప్పటికే చిత్రీకరించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం అస్సలు స్పందించడం లేదు. దీంతో ఇవన్నీ గాలి వార్తలే అని మరియు ఇందులో ఎటువంటి నిజాలు లేదని కొట్టిపారేస్తున్నారు.కానీ కొంతమంది మాత్రం చిరంజీవి సరసన విజయశాంతి అంటే ఆ జోడి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అని అభిప్రాయపడుతున్నారు.