వ్యవసాయ రంగంలో టెక్నాలజీ( Technology ) ఎంతో అభివృద్ధి చెందింది.వ్యవసాయంలో( Agriculture ) పంటలను ఆశించే చీడపీడలను నివారించడం చాలా కీలకం.
ఈ చీడపీడలను నివారించేందుకు ఎన్నో రకాల విషపూరిత రసాయనిక మందులను రైతులు పిచికారీ చేస్తూ ఉంటారు.డ్రోన్ల ద్వారా, స్ప్రేయర్ల ద్వారా పంటలపై పిచికారి చేస్తారని అందరికీ తెలిసిందే.
ఇలా పిచికారి చేయడం వల్ల మొక్కలపైనే కాకుండా పొలం అంతట నేలపైన కూడా పురుగుమందు పడుతూ ఉంటుంది.ఇలా జరగడంతో రసాయన పిచికారి మందులు వృధా అవ్వడమే కాకుండా నేల భూసారం కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది.
ఈ సమస్యలకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ నైకో రోబోటిక్స్( NIQO Robotics ) ఓ చక్కటి పరిష్కారం చూపించింది.సరికొత్త టెక్నాలజీతో స్పాట్ స్ప్రే రోబోను( Spot Spray Robot ) రూపొందించింది.ఈ రోబో ఏం చేస్తుందంటే.మొక్కలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటిపైన మాత్రమే పురుగుమందును పిచికారి చేస్తుంది.ఈ రోబో కృత్రిమ మేధా తో( AI ) నడిచే స్పాట్ స్ప్రే రోబో.ఈ రోబో ప్రత్యేకతలు ఏమిటంటే.
ఈ రోబోకు ఐదు మీటర్ల పొడవైన రెక్కలు రెండు వైపులా ఉంటాయి.ఏకకాలంలో ఈ రోబో 10 మీటర్ల వెడల్పున పిచికారి చేయగలదు.
ఈ రోబో రెక్కలకు కృత్రిమ మేధాతో కూడిన కళ్ళను అమర్చారు.
ఈ రోబోకు ఉండే కళ్ళు మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తాయి.ఎప్పుడైతే రోబో మొక్కలు ఉన్నచోటికి వెళ్తుందో ఆటోమేటిక్గా నాజిళ్లు తెరుచుకుని పురుగుమందు మొక్కపై పిచికారి చేస్తుంది.మొక్క లేకుండా కాళీ నేల ఉన్నచోట రోబో రెక్కలకు ఉన్న నాజిళ్లు తెరచుకోవు.
ఈ రోబో తో పిచికారి చేయడం వల్ల దాదాపుగా 60 శాతం పిచికారి మందు ఆదా అవుతుంది.మిర్చి, పత్తి, సోయాబీన్ లాంటి పంటలపై ఈ రోబోతో పిచికారి చేయవచ్చు.
తమిళనాడుకు చెందిన జై సింహా అనే వ్యక్తి పిచికారి పద్ధతులను అధునీకరిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి బెంగుళూరు కేంద్రంగా నైకో రోబోటిక్స్ ను నేలకొల్పారు.