ప్రజల సంపూర్ణ మద్ధతు బీజేపీకే..: కిషన్ రెడ్డి

తెలంగాణలో బీజేపీకి ప్రజలు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని తెలిపారు.

 People's Full Support To Bjp..: Kishan Reddy, Kishan Reddy, Brs Govt , Revanth R-TeluguStop.com

బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt )లో అన్నీ కుంభకోణాలేనని కిషన్ రెడ్డి ఆరోపించారు.బీఆర్ఎస్ నేతల కుంభకోణాలపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని చెప్పారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.బీఆర్ఎస్ ఓడిపోయి ఐదు నెలలు అయినా ఓటమిని ఒప్పుకోలేకపోతుందని ఎద్దేవా చేశారు.గ్యారెంటీల విషయంలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) అబద్దాలు చెబుతున్నారన్నారు.వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామన్నారన్న కిషన్ రెడ్డి ఎన్ని అమలు చేశారో చెప్పాలన్నారు.

ఈ క్రమంలోనే ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని తెలిపారు.అదేవిధంగా బీజేపీపై అడ్డగోలుగా మాట్లాడొద్దని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube