తెలుగు కామెడీ షో జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ ఆది ( Hyper Aadi )అందరికీ సుపరిచితుడే.తెలుగు టెలివిజన్ రంగంలో అనేక టీవీ షోలలో.
ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మరోపక్క సినిమాలు చేస్తూ విజయవంతమైన కెరియర్ తో రాణిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో రానున్న నెల రోజులు పాటు హైపర్ ఆది షూటింగులను పక్కన పెట్టేశారు.
జనసేన స్టార్ క్యాంపెనర్ల జాబితాలో ఆజీ పేరు కూడా ఉంది.దీంతో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం పిఠాపురంలో హైపర్ ఆది పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా గురువారం అక్కడ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గానికి చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది తండోపతండాలుగా వస్తారని అన్నారు.
హైదరాబాదు నగరాన్ని చూసేందుకు పర్యాటకులు ఏ విధంగా అయితే వస్తున్నారో… మున్ముందు పిఠాపురాన్ని చూడటానికి కూడా వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు తెలుగు ఇండస్ట్రీ నుండి చాలామంది జనసేన పార్టీకి మద్దతు తెలపటానికి ప్రచారంలో పాల్గొనటానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.పిఠాపురం ప్రజల నుండి జనసేన పార్టీ( Janasena party )కి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పుకొచ్చారు.కచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తారని అన్నారు.ఏపీలో ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు… పలు పార్టీలకు మద్దతు తెలుపుతూ పర్యటించడానికి రెడీ అవుతున్నారు.
ఇటీవల హీరో నవదీప్( Navadeep ) సైతం జనసేన పార్టీకి మద్దతు తెలపడానికి రెడీగా ఉన్నట్లు ప్రకటన చేశారు.తెలుగు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు జనసేన పార్టీని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు.
తాజా వార్తలు