అల్లా దయ వల్ల నా భర్త సర్జరీ విజయవంతమైంది.. నటి సనా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రముఖ నటి సనా బేగమ్( Sana Begum ) కు మంచి గుర్తింపు ఉంది.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సీరియళ్లలో నటించడం ద్వారా సనా పాపులర్ అయ్యారు.

 Sana Instagram Post Goes Viral In Social Media Details Here ,sana Begum , Inst-TeluguStop.com

సనా రెమ్యునరేషన్ సైతం చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.సాధారణంగా సోషల్ మీడియా( Social media )లో యాక్టివ్ గా ఉండే సనా గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.

రంజాన్ పండుగ( Ramadan ) సమయంలో సనా నుంచి ఎటువంటి పోస్ట్ లు రాకపోవడంతో ఆమె అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.అభిమానుల నుంచి ఎక్కువ సంఖ్యలో మెసేజ్ లు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఇన్ స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండనందుకు నన్ను క్షమించాలని ఆమె కోరారు.దురదృష్టవశాత్తూ ఇటీవలే నా భర్తకు గుండెపోటు వచ్చిందని సనా పేర్కొన్నారు.

నా భర్తను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించడంతో ఆయనకు పెద్ద గండం తప్పిందని ఆమె వెల్లడించారు.అల్లా దయ వల్ల సర్జరీ విజయవంతమైందని ఆమె చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నా భర్త ఆరోగ్యంగా ఉన్నారని మీ ఆదరాభిమానాలు నాపై ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని సనా అన్నారు.సనా చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సనా భర్త త్వరగాఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తమ సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు.

సనా కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సనా సినిమాలతో కూడా బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సనా బేగమ్ కు ఇతర భాషల్లో సైతం నటిగా మంచి గుర్తింపు ఉండటం గమనార్హం.


.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube