ఇప్పటి వరకు మనం కేవలం సైబర్ దాడులు, హ్యాకర్లు, పిషింగ్ వంటి వాటి గురించి విన్నాం.దీని వల్ల చాలా మంది తమ డబ్బును, విలువైన సమాచారాన్ని కోల్పోయిన కేసులు ఉన్నాయి.
అయితే, ఇప్పుడు తాజాగా పెగాసస్ అనే స్రైవేర్ దేశవ్యాప్తంగా సంచలనం అయింది.ముఖ్యంగా రాజకీయ బడా నాయకుల ఫోన్లను దీని ద్వారా రికార్డ్ చేస్తున్నారని.
వారికి తెలియకుండానే కేవలం జీరో క్లిక్ ద్వారా ఫోన్లలోకి ప్రవేశిస్తోంది.దీనివల్ల ఎలా మనం సేఫ్‌గా ఉండాలో తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది పెగాసస్.దీని ద్వారా కొంత మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకుల ఫోన్లను రికార్డు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.2016లోనే పెగాసస్ గురించి విన్నాం.ప్రస్తుతం ఇది కాస్త వివాదాస్పదంగా మారుతోంది.
పెగాసస్ స్పైవేర్‌ను ఇజ్రాయేల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ సంస్థ తయారు చేసింది.దీన్ని జిరో క్లిక్‌తో ఫోన్లను అటాక్ చేయవచ్చని తెలిసింది.
ఆ వివరాలు తెలుసుకుందాం.

జిరో క్లిక్ అంటే.సాధారణంగా మన స్మార్ట్ ఫోన్లకు మాల్వేర్ అటాక్ యూజర్ తెలియక చేసిన పొరపాట్ల వల్లే ఫోన్లలో ఎంటర్ అవుతుంది.అంటే తెలియని లింక్స్, ఈమెయిల్స్‌ను క్లిక్ చేస్తే, మీ డివైజ్‌లోకి మాల్వేర్ ప్రవేశిస్తుంది.
దీనికి ఆ లింక్‌లను క్లిక్ చేయకుంటే భద్రంగా ఉండవచ్చు.కానీ, పెగాసస్ మాల్వేర్‌కు ఎటువంటి లింక్‌లను పంపించకుండానే డివైజ్‌లోకి ప్రవేశిస్తుంది.
దీనికి యూజర్ల ఇంటరాక్షన్ లెకుండానే ఫోన్‌లోకి వచ్చేస్తుంది.అంటే మన ఫోన్లలో ఉండే కొన్ని యాప్స్ ద్వారా హ్యాకర్ టార్గెట్ చేసిన వ్యక్తి ఫోన్‌లోకి కోడ్ ద్వారా ప్రవేశపెడతారు.
అది కనిపించని టెక్స్›్ట లేదా ఇమేజ్ ఆధారంగా ఇంజెక్ట్ చేస్తారు.ఇటువంటి పెగాసస్ జీరో క్లిక్ హ్యాకర్ దాడి చాలా అరుదు.
అంటే యాంటీవైరస్ ద్వారా లేదా ఫోన్లలో ఈజీగా తనిఖీ చేయడం సులభం కాదు.అయితే దీనికి మీ వ్యక్తిగత డేటా లీక్ అయిందో లేదా తెలుసుకోవడానికి కొన్ని నియమాల ద్వారా తెలుసుకోవచ్చు.
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవల్సి ఉంటుంది.«థర్డ్‌పార్టీ యాప్స్ లేదా తక్కువ వ్యక్తులు ఇన్‌స్టాల్ చేసుకునే యాప్‌లను సైడ్‌లోడింగ్ చేయవద్దు.
ముఖ్యంగా ఎటువంటి కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్లలో చేయకూడదు.స్పైవేర్‌కు సంబంధించిన పూర్తి సమాచాం మనకు ఇంకా తెలియాల్సి ఉంది.
అందుకే దీనికి పూర్తి పరిష్కారం లభించే వరకు కంపెనీ లేదా ఇతర మీ పర్సనల్ పనులను స్మార్ట్‌ఫోన్లలో చేయకుండా ఉండటమే మేలు.