నేడు స్వామి వివేకానంద జయంతి.స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం( National Youth Day ) సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో యువతీయువకులతో పవన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ.వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం( TDP Janasena ) వస్తుందని తెలిపారు.
అధికారంలోకి వచ్చాక యువత గొంతు అవుతానని పేర్కొన్నారు.యువత చెప్పే ప్రతి ఆలోచనను తాను శ్రద్ధగా వింటానని స్పష్టం చేశారు.
అవసరమైతే అన్ని ఆలోచించి ప్రజాపాలసీగా తీసుకొస్తానని పేర్కొన్నారు.తమ ప్రభుత్వం వచ్చాక జవాబుదారితనం తీసుకొస్తానని అన్నారు.యువతకు మంచి భవిష్యత్తు కల్పించే విధంగా భరోసా ఇస్తామని స్పష్టం చేశారు.జనసేన పార్టీకి యువతే పెద్ద బలం.అందువల్లే వైసీపీ( YCP ) వంటి నేరపూరిత ఆలోచన కలిగిన పార్టీతో పోరాడగలుగుతున్నాం.దశాబ్ద కాలంగా నన్ను నమ్మిన యువతకు కచ్చితంగా అండగా ఉంటానని అన్నారు.
యువతరం ఆలోచనలు ఎప్పుడు కొత్తగా ఉంటాయి.యువ ప్రతినిధులతో మాట్లాడిన ప్రతిసారి కొత్త ఉత్తేజం కలుగుతుంది.
దేశం కోసం సమాజం కోసం ఏదైనా మంచి చేయాలని ఉద్దేశంతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించినట్లు పవన్( Pawan Kalyan ) స్పష్టం చేశారు.యువత తమ స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం అనే ధోరణితో ఆలోచించి ఆ దిశగా బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు.
నేను అధికారంలోకి వస్తే అది చేస్తా… ఇది చేస్తా అని కాదు.అందరికి ఉపయోగపడే మంచి పనులు చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.