ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే జనసేనలో వినిపిస్తున్నాయి.కీలకమైన మునిసిపల్ ఎన్నికల సమయంలో వైసీపీ, టీడీపీలకు ప్రచారం చేసేందుకు కొన్ని చానళ్లు ఉన్నాయి.
కానీ, జనసేనకు మాత్రం సొంత చానెల్ ఉన్నా.ప్రయోజనం లేదనే వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి ఈ పార్టీ అనాథ ఏమీ కాదు.దీనికి కూడా సొంతగా ఓ టీవీ చానెల్ ఉంది.
అయితే.ఆ చానెల్ అంతగా పాపులర్ కాకపోవడమే పెద్ద మైనస్.
దీంతో జనసేనాని పవన్ తీసుకునే చర్యలు, ఆయన స్టేట్ మెంట్లు.ప్రజలకు సరైన సమయంలో చేరడం లేదు.
అదేవిధంగా ఆశించిన విధంగా వైరల్ కూడా కావడం లేదు.అనే ఆరోపణలు ఉన్నాయి.
సరిగ్గా ఈ సమయంలోనే ప్రవాస భారతీయులకు చెందిన(ఎన్నారైలు) ఒక శాటిలైట్ చానెల్.జనసేనను ప్రమోట్ చేస్తోందని తెలిసింది.అందులో పనిచేసే ఒక యాంకర్ అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు తెలుసుకుని.ఆయన ప్రభావాన్ని తగ్గించి.
కమర్షియల్ యాంగిల్‌లో ఆలోచన చేశారట.ఇంత వరకు బాగానే ఉన్నా.
చానెల్ రన్ చేయాలంటే.భారీ ఎత్తున సొమ్ములు అవసరం.
ఈ నేపథ్యంలో జనసేనను ప్రమోట్ చేసిన తర్వాత.వాళ్లను సొమ్ముల విషయంపై అడగ వచ్చని నిర్ణయించుకున్నారట.

ఈ నేపథ్యంలోనే పవన్‌ను నిధులు సమకూర్చారని.జనసేనవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడం గమనార్హం.అయితే.ఈ చానెల్ కూడా రంగంలోకి దిగేందుకు సమయం పడుతుందని అంటున్నారు.ఈ లోగా.టీడీపీ అనుకూల మీడియాలో మేనేజ్ చేసుకునేందుకు పవన్ ప్రయత్నించారు.
కానీ, ఇప్పుడు వారు కూడా విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.మొత్తంగా ఈ వ్యవహారం.
ఇప్పడు జనసేనను కుదిపేస్తోంది.తమకు అనుకూలంగా లేదా.
వైసీపీకి వ్యతిరేకంగా పవన్ చేసే కామెంట్లకు టీడీపీ అనుకూల మీడియా బాగానే కవర్ చేస్తోంది.
కానీ, పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలు.
చేసే ప్రసంగాలు.లక్ష్యాలకు, తీర్మానాలకు మాత్రం ఈ మీడియా ఏమాత్రం కవర్ చేయడం లేదని అంటున్నారు.
దీంతో జనసేన వాయిస్ బలంగా వినిపించలేక పోతున్నామనే ఆవేదన కనిపిస్తోంది.మొత్తంగా సొంత చానెల్ ఉండి కూడా జనసేన కష్టాలు పడుతోందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.