పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే నష్టాలు తప్పవా.. ఇది కొత్త సెంటిమెంట్!

టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.

 Pawan Kalyan Bad Sentiment , Pawan Kalyan, Bad Sentiment, Ante Sundaraniki, Repu-TeluguStop.com

ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తూ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు.ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతను అశేష ప్రేక్షకాదరణ ను సంపాదించుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే రెండు రోజుల ముందు నుంచే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది.

పవన్ అభిమానులు థియేటర్ల వద్ద చేసే హంగామా గురించి మన అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సినిమాలలో ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ తన తోటి హీరోలకు సపోర్ట్ ను అందిస్తుంటారు.అయితే పవన్ కళ్యాణ్ అటెండ్ అయిన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి అన్న సెంటిమెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

రవితేజ నటించిన నేల టికెట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన విషయం తెలిసిందే.

Telugu @republic, Bad, Guest, Pawan Kalyan, Pre-Movie

అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఈవెంట్ కు వచ్చినప్పటికీ ఆ సినిమా గురించి తప్ప మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్.అలా పవన్ కళ్యాణ్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలతో చివరికి ఇది పబ్లిక్ సినిమా విడుదలైన విషయాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు.అలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావం పబ్లిక్ సినిమాపై గట్టిగానే పడింది అని చెప్పవచ్చు.

తాజాగా నాని నటించిన అంటే సుందరానికి సినిమా రిలీజ్ ఈవెంట్ కి కూడా పవన్ కల్యాణ్ హాజరయ్యారు.పవన్ కళ్యాణ్ రాకతో ఆ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఫెయిలవడంతో పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా పిలిచి నాని తప్పు చేశాడు అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.ఒకవేళ పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా పిలవకపోయినా ఉంటే అంతే సుందరానికి కమర్షియల్ సినిమా సక్సెస్ అయి ఉండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలా మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు, ప్రమోషన్లకు వస్తే ఆ సినిమా ఫ్లాప్ అన్నది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్ గా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube