తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలుగా ఒక వెలుగు వెలిగి పోయారు అలాంటి వారిలో అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి లాంటి వారు స్టార్ హీరోగా గుర్తింపు పొందారు వాళ్లని స్ఫూర్తిగా తీసుకున్న చాలామంది ఇండస్ట్రీకి రావడం మొదలుపెట్టారు అలా వచ్చిన వారిలో భానుచందర్ కూడా ఒకరు.భానుచందర్ కరాటే, మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకొని ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు సాధించాడు.
అలాగే తన ఫ్రెండు అయిన సుమన్ ని కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చి సుమన్ తో కూడా సినిమాలు తీసేలా చేశాడు.
సుమన్ అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.
భానుచందర్, సుమన్ ఇద్దరు కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఏ డుపు లేకుండా స్వతహాగా ఫైట్లు చేసేవారు వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు.అయితే భానుచందర్ అప్పట్లో ఏఎన్నార్ తో సూత్రధారులు అనే సినిమాలో నటించారు దానికంటే ముందే ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరితో కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ అయిన సత్యం శివం సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి తనకంటూ నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు.
అయితే భానుచందర్ వాళ్ల అమ్మ పచ్చకామర్లు వచ్చిన వాళ్లకి మందు ఇచ్చేది దానిలో భాగంగానే ఆవిడ శివాజీ గణేషన్ భార్య లాంటి వారికి కూడా మందు ఇచ్చి ఆమె కామెర్లను తగ్గించారు.అలా ఆవిడ గురించి ఇండస్ట్రీ మొత్తం తెలిసింది డే అండ్ నైట్ షూటింగ్ లు చేయడం వల్ల సమయానికి సరిగా తినకపోవడం వల్ల ఎన్టీఆర్ గారికి కూడా పచ్చకామర్లు వచ్చాయి అప్పుడు భానుచందర్ వాళ్ళ అమ్మ దగ్గరికి ఎన్టీఆర్ వెళ్లి అక్క నాకిలా పచ్చకామర్లు వచ్చాయి మీరు మందు ఇస్తారు అని తెలిసింది నాకు కూడా కొంచెం ఇవ్వండి అని చెప్పడంతో సరే అని ఆవిడ పొద్దున తీసుకువచ్చి మందు ఇచ్చింది, దాంతో ఆయన పచ్చకామర్లు పోయి హెల్త్ కుదుటపడింది.
సరిగ్గా అదే టైంకి భానుచందర్ సత్యం శివం సినిమా షూటింగ్ లో ఉన్నారు అయితే ఎన్టీఆర్ గారు భానుచందర్ ని ఆ సినిమా షూటింగ్ లో చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అని భానుచందర్ ఇప్పటికే చెబుతుంటాడు ఎందుకంటే ఎన్టీఆర్ భానుచందర్ వాళ్ళ అమ్మని సొంత వాళ్ల అక్కల భావిస్తాడు ఎందుకంటే పచ్చకామెర్లకు ఎన్టీఆర్ గారికి మందు ఇచ్చి బాగు చేసింది అందుకే భానుచందర్ షూట్ లో ఉన్నప్పుడు ఇబ్బంది పడకూడదని ఎన్టీఆర్ అన్ని విషయాలు అడిగి తెలుసుకునేవాడు అని చెప్పాడు.అలాగే ఎన్టీఆర్ గారికి తగ్గిన తర్వాత ఒకసారి బాలకృష్ణ గారికి కూడా అలాగే పచ్చ కామెర్లు వచ్చాయి దాంతో బాలకృష్ణ హాస్పిటల్ కి వెళ్తాను అని చెప్తే ఎన్టీఆర్ ఆస్పత్రి కి వెళ్లడం వద్దని చెప్పి భానుచందర్ వాళ్ళ అమ్మ నాకు అక్క లాంటిది.ఆ అక్క నాకు మందు ఇచ్చి పచ్చకామెర్లు తగ్గించింది అలాగే నువ్వు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళు మందు తీసుకొని వాడు ఆ తర్వాత నీకే అది తగ్గిపోతుంది అని చెప్పాడు.అయితే ఒక రోజు బాలకృష్ణ పచ్చ కామెర్లు మందు తీసుకోవడానికి భానుచందర్ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ల అమ్మ భానుచందర్ ని లేపి బాలకృష్ణ వచ్చాడు వెళ్లి ఆయనతో మాట్లాడు అని చెప్పడంతో భానుచందర్ బాలకృష్ణ దగ్గరికి వెళ్లి మాట్లాడేవాడిని చెప్పాడు అయితే బాలకృష్ణ మందు తీసుకొని వాడిన తర్వాత ఆయనకి పచ్చకామెర్ల వ్యాధి తగ్గిపోయింది.
భానుచందర్ వాళ్ళ అమ్మ గురించి చెబుతూ రోజూ ఇలాగే కొంతమందికైనా రోగాన్ని తగ్గించడానికి మందులు ఇస్తుందని అది కూడా ఉచితంగా ఇచ్చేదని చెప్పాడు.దాంతో ఎన్టీఆర్ భానుచందర్ వాళ్ళ అమ్మని అక్క అని పిలిచాడు భానుచందర్ వాళ్ళ అమ్మ ఎన్టీఆర్ నీ అన్నయ్య అని పిలిచేది అప్పుడప్పుడు ఎన్టీఆర్ భానుచందర్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు భానుచందర్ వాళ్ళమ్మతో ఇలా అనేవారట నా తోడు పుట్టకపోయిన మీరు నాకు దేవుడిచ్చిన అక్క లాంటి వారు అని చాలాసార్లు చెప్పేవారట.
అప్పట్లో భానుచందర్ సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉండేవారు.అయితే హీరోగా వేషాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం మొదలుపెట్టారు.
అందులో భాగంగానే రాజమౌళి తీసిన సింహాద్రి సినిమాలో భూమిక తండ్రి పాత్రలో నటించి మంచి గుర్తింపును సాధించారు ఆ సినిమాలో ఆయన పాత్ర మంచి గుర్తింపు వచ్చింది.