ఒకపక్క ఫిబ్రవరి 1 ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు నిర్భయ నిందితులను ఉరి తీస్తారా అని ఎందరో ఎదురు చూస్తున్న సమయంలో నిర్భయ దోషులు మాత్రం రోజుకొక ఆరోపణ తో కోర్టు లో కాలయాపన చేసే పనిలో ఉంటున్నారు.ఉరిశిక్షలు దగ్గర పడుతున్న కొద్దీ వారు చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
మొన్నటికి మొన్న నిందితుల తరపు న్యాయవాది కోర్టు లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.నిర్భయ నిందితుల్లో ఒకరికి స్లో పాయిజన్ ఇస్తున్నారు అని,తలను రెండు భాగాలూ చేసి చూసారు అంటూ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇంకా ఆ విషయాలపై విస్తుపోతున్న జనాలకి ఇప్పుడు నిర్భయ నిందితుల్లో ఒకరైన ముకేశ్ పై అత్యాచారం జరిగింది అంటూ కోర్టు సాక్షిగా సంచలన ఆరోపణలు చేశారు.జైలు అధికారులు ప్రోద్బలం తోనే తనపై అత్యాచారం జరిగింది అంటూ నిందితుల్లో ఒకరైన ముఖేశ్ కోర్టు లో సంచలన ఆరోపణలు చేశారు.
తనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ కేసు దోషి ముఖేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది.చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేతో పాటు జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటున్న సందర్భంగా ముఖేశ్ ఇలాంటి సంచలన ఆరోపణలు చేశాడు.
తనపై తీహార్ జైలులో అత్యాచారం జరిగిందని, సహ నిందితుడు అక్షయ్ ఠాకూర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించాడు.ఇదే విషయాన్నీ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పెట్టుకున్న విన్నపంలో కూడా ప్రస్తావించానని కానీ అదేమీ పట్టించుకోకుండా దానిని తిరస్కరించారని తెలిపారు.
జైలు అధికారుల ప్రోద్బలంతోనే ఇది జరిగిందని పిటిషన్లో పేర్కొన్నాడు.
నిర్భయ కేసులో పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్‌కు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇందుకోసం తీహార్ జైలు అధికారులు మరోసారి ట్రయల్స్ నిర్వహించారు.మరోవైపు చావు నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు అనేక రకాలుగా న్యాయమార్గాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు.
దీంతో ఫిబ్రవరి 1న వారికి మరణశిక్ష అమలవుతుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.