రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలను అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ హైదరాబాద్ నగరంలో మహిళలపై జరుగుతున్న టువంటి ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతోంది. తాజాగా ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని ఓ యువకుడు తనని పెళ్లి చేసుకోకపోతే మొహం మీద యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించిన ఘటన హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని ఎస్.
ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే కవిత అనే యువతి ఉద్యోగరీత్యా హైదరాబాద్ నగరంలోని ఎస్.ఆర్.నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి లేడీస్ హాస్టల్ లో ఉంటుంది.అయితే గత కొద్ది రోజులుగా ఈమె శశాంక్ అనే యువకుడు కవిత ని ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతూ ఉండేవాడు.
అంతేకాక ఆమెను పెళ్లి చేసుకోవాలని వేదిస్తూ ఉండేవాడు.అయితే తనకు ఇష్టం లేదని పలుమార్లు కవిత చెప్పేది.దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ఆ యువకుడు తనని కాకుండా ఇంకా ఎవరైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తానని జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని మానసిక వేదనకు గురి చేసేవాడు.అయితే ఈ విషయమై తాజాగా కవిత శశాంక్ గొడవ పడుతూ ఈ గొడవలో శశాంక్ తను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు.
దీంతో భయపడినటువంటి కవిత వెంటనే ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులను ఆశ్రయించి తనకు రక్షణ కల్పించాలని కోరింది.అలాగే తనను వేధిస్తున్న టువంటి శశాంక్ పై కేసు నమోదు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న టువంటి నిందితుడు శశాంక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.దాంతో పోలీసులు అతడిని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.