అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఓ ఢిల్లీ వాసి ట్వీట్ చేశాడు దాంట్లో వింతేముంది అనుకుంటున్నారా.అవును నిజంగానే వింత ఉంది.
నరేంద్ర మోడీ, క్రేజీవాల్ ఇద్దరూ మా గోడు పట్టించుకోవడం లేదు మీరన్నా సాయం చేయండి అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది.వివరాలలోకి వెళ్తే.
భారతదేశంలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ట్రంప్ కి ట్వీట్ వెళ్ళింది.ఢిల్లీ సమీపంలోని రేవారి మార్గంలో పాలం రైల్వే స్టేషన్ ఉంది…ఇక్కడి నుంచీ ప్రయాణం చేసేవారు ఎక్కువ అయితే ఇక్కడ చేతక్ ఎక్స్ప్రెస్ రైలు ఆగడం లేదు.దీంతో ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.దాంతో ఈ విషయంపై ఓ ప్రయాణికుల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభులకు విజ్ఞప్తులు పంపించినప్పటికీ ఫలితం లేదని తెలిపింది.దాంతో
ఈ సంఘం ప్రతినిధి ఒకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయాన్ని కోరుతూ ఓ ట్విట్ చేశారు.
భారతదేశంలో ఢిల్లీ- రేవారీ మార్గంలో పాలం రైల్వే స్టేషన్ ఉంది.ఈ స్టేషన్లో చేతక్ ఎక్స్ప్రెస్(12981-12982) ఆగడం లేదు.రైల్వే శాఖ మంత్రికి, రైల్వే అధికారులకు చాలా సార్లు లేఖలు రాసిన ఫలితం ఉండటం లేదు.మీరు ఓసారి రైల్వే శాఖ మంత్రికి లేఖ రాయండి…మీరు స్పందించినా సరే మాకు న్యాయం జరుగుతుందో లేదో చూద్దాం అంటూ బాలకృష్ణ అమరసారియా, ఢిల్లీ, భారతదేశం అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు…ఇప్పుడు ఈ వినతి సంచలనం సృష్టిస్తోంది.మరి ఈ విషయంపై ట్రంప్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.