టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ మూవీని ఎట్టకేలకు ప్రారంభించిన విషయం తెల్సిందే.రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను కోకా పేటలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ అతి త్వరలోనే జరుగబోతుంది.షూటింగ్ మొదలు పెట్టబోయే ముందు దర్శకుడు రాజమౌళి సెక్యూరిటీ విషయంలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఈమద్య కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు కూడా లీక్ అవుతున్నాయి.ముఖ్యంగా స్టిల్స్ ఎక్కువగా లీక్ అవుతున్నాయి.దాంతో రాజమౌళి తన సినిమా విషయంలో అలా జరగవద్దని భావిస్తున్నాడు.పెద్ద ఎత్తున అందుకోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.రాజమౌళి ప్రతి విషయాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాడు.సెట్‌లోకి మొబైల్స్ అనుమతించకుండా లీక్‌ను అడ్డుకోవచ్చు.
కాని హిడెన్ కెమెరాలతో ఎవరైనా లీక్ చేసే ప్రమాదం ఉందని సెట్‌లలో జామన్‌లను వాడబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
జామర్ వాడటం వల్ల బటన్ కెమెరాలు, కళ్లద్దాల కెమెరాలతో పాటు ఇతర ఏ ఎలక్ట్రానిక్ పరికరం కూడా పని చేయదు.పైరసీని, లీక్‌ను ఎదుర్కొనేందుకు ఇదే మార్గంగా ఆయన భావిస్తున్నాడు.బాహుబలి విషయంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.
అందుకే ఈసారి ముందు నుండే లీక్‌ల నుండి సినిమాను కాపాడుకునేందుకు జక్కన్న విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.భారీ ఎత్తున అంచనాలున్న మల్టీస్టారర్ మూవీ 2020వ సంవత్సరంలో విడుదలకు సిద్దం చేస్తున్నాడు.
ఈ చిత్రంలో హీరోయిన్స్ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.