హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్న పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి శేరిలింగంపల్లి నియోజవర్గం హైదర్ నగర్ డివిజన్ కృష్ణవేణి నగర్లో, స్థానిక దళిత మోర్చ నాయకుడు నర్సింగ్ ఇంట్లో అల్పాహారం చేశారు.అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతుంది అనేది పరిశీలించేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చానని తెలిపారు.
హైదర్ నగర్ డివిజన్ దళిత మోర్చ నాయకుడు నర్సింగ్, అల్పాహారాన్ని స్వీకరించాలని కోరటంతో తాను అల్పాహారం చేసేందుకు వచ్చానని, పర్యటన గురించి మరిన్ని వివరాలు నేడు నిర్వహించనున్న విలేఖరుల సమావేశంలో వెల్లడిస్తానని మంత్రి అన్నారు.