ఏపీ టీడీపీలో తారాస్థాయికి టికెట్ల పంచాయతీ..!!

ఏపీలోని టీడీపీ( TDP )లో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది.తప్పనిసరి పరిస్థితులు ఉంటే సీట్ల అభ్యర్థుల విషయంలో మార్పులు ఉంటాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Panchayat Tickets To The Highest Level In Ap Tdp, Tdp, Chandrababu , Ycp, Ys Ja-TeluguStop.com

దీంతో టికెట్ రాని వారు ఆశతో ఎదురుచూస్తుండగా.ఇప్పటికే ప్రకటించిన కొందరు అభ్యర్థుల్లోనూ అలజడి మొదలైందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో అసమ్మతి నేతలు పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు.ఇందులో భాగంగానే ఉండి మరియు గణపతినగరం నియోజకవర్గాల్లో అభ్యర్థులు హైకమాండ్ పై గుర్రుగా ఉన్నారు.ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చవద్దంటూ పార్టీ క్యాడర్ డిమాండ్ చేస్తున్నారు.అయితే ఉండి నియోజకవర్గ అభ్యర్థిని మార్చారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రామరాజు( MLA Ramaraju) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

పార్టీ కోసం ఇన్నేళ్లు కష్టపడితే ఇదేనా ఫలితం అంటూ ఆయన వాపోయారు.అదేవిధంగా గజపతినగరం నియోజకవర్గంలోనూ ట్విస్ట్ నెలకొంది.టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస రావు వ్యతిరేక వర్గం ఆగ్రహంగా ఉంది.టికెట్ దక్కకపోవడంతో నియోజకవర్గంలో ఉన్న రెండు అసమ్మతి వర్గాలు ఏకం అయ్యాయి.

ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కేఏ నాయుడు, శివరామకృష్ణ ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube