జూన్ 12న ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్.మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి.

 ‘pakka Commercial’ Trailer Launch Event On June 12 Pakka Commercial, Trailer-TeluguStop.com

ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

తాజాగా సినిమా ట్రైలర్ అప్‌డేట్ తెలిపారు దర్శక నిర్మాతలు.
జూన్ 12 సాయంత్రం 5 గంటలకు మూసాపేట్‌లోని ఏసియన్ సినిమాస్ లలితకళా థియేటర్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరగనుంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ గ్లింప్స్ ఆసక్తి పెంచేసింది.గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు.కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది.

గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు.ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

SKN సహ నిర్మాత‌.మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

నటీనటులు:

గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు

టెక్నికల్ టీం:

స‌మ‌ర్ప‌ణ – అల్లు అరవింద్, బ్యాన‌ర్ – జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్ , నిర్మాత‌ – బ‌న్నీ వాస్, ద‌ర్శ‌కుడు – మారుతి , ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ – ర‌వీంద‌ర్ మ్యూజిక్ – జ‌కేస్ బీజాయ్, స‌హ నిర్మాత – ఎస్ కే ఎన్, లైన్ ప్రొడ్యూసర్ – బాబు , ఎడిటింగ్ – ఎన్ పి ఉద్భ‌వ్, సినిమాటోగ్ర‌ఫి – క‌ర‌మ్ చావ్ల‌ పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube