మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే.అదే విధంగా పవన్ కళ్యాణ్ ఏదైనా ఈవెంట్ లో కానీ, సభలో కానీ కనిపించారు అంటే చాలు అభిమానులు రెచ్చిపోతూ ఉంటారు.
తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు మరొకసారి రెచ్చిపోయారు.హీరో నాని నటించిన అంటే సుందరానికి సినిమా రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఇతర నటులు మాట్లాడకుండా ఇబ్బంది పెట్టారు పవన్ కళ్యాణ్ అభిమానులు.
అయితే ఇదే విషయం గురించి అభిమానులు హెచ్చరించినప్పటికీ వారు మాత్రం తగ్గలేదు.తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని శిల్పారామం లో జరిగిన విషయం తెలిసిందే.
అయితే అభిమానులు ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇదే విషయంపై డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ కి చురకలంటించారు.ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ సినీ ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యామిలీ కాదు ఇండస్ట్రీ అంతా ఓకే ఫ్యామిలీ.అభిమానులందరికీ ఒక చిన్న విన్నపం పవన్ కళ్యాణ్ గారు బయట హీరోల ఫంక్షన్ కి వచ్చినప్పుడు మీరు డిస్టర్బ్ చేయకుండా ఈవెంట్ సజావుగా సాగేలా చేస్తే ఆయన మరొక పది ఫంక్షన్లకు వస్తారు.

అప్పుడు మనం కూడా బయట ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని చూడవచ్చు.అలా కాకుండా ఇలానే డిస్టర్బ్ చేస్తూ ఎవరైనా మాట్లాడుతూ వుంటే ఆయన ఫంక్షన్లకు రావడం మానేస్తారు.అప్పుడు పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ ని యూట్యూబ్ లోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మనం దయచేసి సైలెంట్ గా ఉండాలి అంటూ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులను కోరారు.







