నేడు ఇంగ్లాండ్ తో పాక్ కీలక పోరు.. అద్భుతం జరిగితేనే పాక్ సెమీస్ కు..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో లీగ్ మ్యాచ్లు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి.భారత్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ చేరగా.

 Pakistan's Crucial Match With England Today.. If A Miracle Happens, Pakistan Wil-TeluguStop.com

సెమీ ఫైనల్ కు చేరే నాలుగో జట్టు ఏదో నేడు తెలియనుంది.

Telugu Australia, England, India, Zealand, Odi, Pakistan, Africa-Sports News క

న్యూజిలాండ్ జట్టు( New Zealand ) శ్రీలంక జట్టుపై ఘన విజయం సాధించి దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.అయితే న్యూజిలాండ్ జట్టు సెమీస్ రేస్ నుంచి తప్పుకోవాలంటే పెద్ద అద్భుతమే జరగాల్సి ఉంటుంది.నేడు జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై ఊహించని రీతిలో ఏకంగా 287 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలిస్తేనే సెమీఫైనల్ కు చేరుతుంది.

ఎందుకంటే.న్యూజిలాండ్ జట్టు 10 పాయింట్లతో ఉంది.

ఇంగ్లాండ్ పై పాకిస్తాన్( Pakistan ) స్వల్ప పరుగుల తేడాతో గెలిస్తే పది పాయింట్లతో ఉంటుంది.అప్పుడు రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ సెమీఫైనల్ లో అడుగుపెడుతుంది.

Telugu Australia, England, India, Zealand, Odi, Pakistan, Africa-Sports News క

పాకిస్తాన్, ఇంగ్లాండ్ పై గెలిచి సెమీ ఫైనల్ చేరాలంటే.తొలి పవర్ ప్లే లో బ్యాటింగ్ అద్భుతంగా చేయాల్సి ఉంటుంది.పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ 20 లేదా 30 ఓవర్ల పాటు క్రీజూలో నిలబడితే పాకిస్తాన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది.ఓపెనర్ ఫఖర్ జమాన్ తో పాటు రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ లు కూడా ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్( England ) జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే.ఆ జట్టు విధించిన లక్ష్యాన్ని కేవలం మూడు ఓవర్లలోపే చేదించాలి.ఒకవేళ పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే. ఇంగ్లాండ్ ను 287 పరుగుల తేడాతో మట్టి కరిపించాలి.

క్రికెట్ లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.కాబట్టి పాకిస్తాన్ జట్టు ఆరంభం నుంచి చివరి వరకు ఎలాంటి తప్పిదాలు చేయకుండా భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధిస్తే.

భారత్- పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్ చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube