రంగం సిద్దమౌతోందా.. ఐక్యతే బలమా ?

దేశ రాజకీయాల్లో మోడి మేనియా ఏ స్థాయిలో కొనసాగుతోందా అందరికీ తెలిసిందే.వరుసగా రెండు సార్లు ప్రధానిగా అధికారం చేపట్టిన మోడీ.

 Opposition Parties Uniting Against Bjp Details, Opposition Parties Uniting ,bjp,-TeluguStop.com

( PM Narendra Modi ) మూడవ సారి కూడా అధికారం చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.దాంతో 2024 ఎన్నికల్లో కూడా తమదే విజయం అని కమలనతులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మోడీని గద్దె దించాలని విపక్షాలు కంకణం కట్టుకున్నాయి.మోడీని గద్దె దించేందుకు దొరికే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకూడదని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి.

అందుకోసం అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకుంటూ పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.

Telugu Amith Sha, Congress, Mamta Banerjee, National, Nitish Kumar-National News

అయితే విపక్షల అందరి టార్గెట్ మోడీని గద్దె దించడమే.అందువల్ల అందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటేనే విపక్షాల వ్యూహాలు ఫలించే అవకాశం ఉంది.విపక్షాలన్నిటిని ఏకం చేసేందుకు ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్,( KCR ) తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా మేనర్జీ, అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్.

వంటి బలమైన నేతలు పిలుపునిస్తున్నారు.ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్( Nitish Kumar ) కూడా విపక్షలను ఏకం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు నేషనల్ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

ఈ మేరకు ఆయన త్వరలోనే కే‌సి‌ఆర్, మమతా బెనర్జీ లతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయట.

Telugu Amith Sha, Congress, Mamta Banerjee, National, Nitish Kumar-National News

అయితే ఇక్కడ అందరి ఎజెండా విపక్షలను ఏకం చేయడమే అయినప్పటికి.విపక్షలను లీడ్ చేసే బాద్యత ఎవరు తీసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.అందరూ కూడా హేమాహేమీలు కావడంతో ప్రతిఒక్కరు నాయకత్వ బాద్యతపై నే గురిపెట్టే అవకాశం ఉంది.

దీంతో ఎవరు వెనక్కి తగ్గుతారు ? ఎవరు లీడ్ చేస్తారు అనేదే ప్రశ్నార్థకం.అయితే విపక్షాలను లీడ్ చేసే విషయంలో ఏ మాత్రం తేడా కొట్టిన అది బీజేపీకే ( BJP ) ప్లేస్ గా మారే అవకాశం ఉంది.

ఎందుకంటే రొట్టె కోసం పిల్లి పిల్లి దెబ్బలాడితే కోతి వచ్చి ఎత్తికెళ్ళినట్లు.విపక్షాలు ఐక్యత విషయంలో ఏమాత్రం తేడాకొట్టినా బీజేపీ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.

అందుకే విపక్షాల ఐక్యత విషయంలో మోడీ అమిత్ షా ద్వయం తీక్షణంగా గమనిస్తూ సైలెంట్ గా ఉన్నారు.మరి విపక్షాలు ఎంతమేర ఐక్యత సాధిస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube