ఆన్ లైన్ లోన్ యాప్ దారుణం.. రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు

అవసరాలకు ముందుగా డబ్బులు వస్తే చాలు.తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని చాలా మంది అనుకుంటారు.

 Online Loan App Is Bad Hyderabad Police Who Entered The Field , Online Loans, A-TeluguStop.com

అయితే ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి ఎవరూ ఊహించలేరు.ఆన్ లైన్ లోన్ యాప్ ల జోలికి వెల్లరాదు అని పోలీసులు నెత్తి నోరు బాధుకొని చెబుతున్నారు.

డబ్బు మీద వ్యామోహంతో ఆ యాప్ లకి బలవుతున్నారు.తాజాగా సకాలంలో EMI చెల్లించలేదని ఓ మహిళ ఫొటోను నగ్న చిత్రాలతో మార్ఫింగ్‌ చేసి ఆమె కాంటాక్ట్‌ లిస్ట్‌లోని వారికి పంపించి వేధింపులకు గురి చేసిన ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే. హైదరాబాద్ కి చెందిన ఓ యువతి లోన్ యాప్ లో రుణం తీసుకుంది.అయితే సకాలంలో చెల్లించలేకపోయింది.దీంతో యాప్ ప్రతినిధి.

యువతి ఫొటోలను న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేశాడు.ఆ తర్వాత ఆ న్యూడ్ ఫొటోలను యువతికి పంపి వేధించాడు.

అంతటితో ఆగలేదు.ఆమె బంధువులకు, స్నేహితులకు కూడా పంపి వేధించాడు.అతని వెధింపులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో యువతి పోలీసులను ఆశ్రయించింది.2021లో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే బాధితురాలి ఫోటోను షేర్ చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.

చివరికి బీహార్ రాష్ట్రంలోని సింహాన్ జిల్లా గోపాల్‌పూర్ కోటి గ్రామానికి చెందిన మనీష్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.అసభ్య చిత్రాలను లోన్ తీసకున్న వారి ఫోన్‌లో ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నెంబర్లను ఎంపిక చేసుకొని వారి మొబైల్‌ ఫోన్లకు పంపిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఇదే తరహాలో వేధింపులు భరించలేక గతంలో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలుగు రాస్ట్రాల్లో చోటు చేసుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube