ఆనందయ్య మందుపై కొనసాగుతున్న అధ్యయనం.. మంచిపనికి ఎన్ని అడ్దంకులో.. ?

నా దేశం ఇండియా అని గర్వంగా చెప్పుకుంటాం కానీ ఇక్కడున్నంతగా అవినీతి మరెక్కడ ఉండదని అంటారు.

ఒక మంచిపని అందులో పదిమందికి ఊపయోగపడే పని చేద్దామంటే అలాంటి వారిని రాచీరంపాన పెడతారు.

అదే బ్యాంకుల్లో కోట్లకొద్ది లోన్లు తీసుకుని ఎగ్గోట్టిన దొంగల విషయంలో, స్కాంలు చేసి లక్షల కోట్లు వెనకేసుకుంటున్న నేతల గురించి మాత్రం పట్టించుకోరు.అరే కరోనా వచ్చి జనం లక్షల్లో మరణిస్తుంటే శవాల మీది పేలాలు ఏరుకునే వారే తెరమీదికి వచ్చారు.

కానీ ఒక సాధారణ వ్యక్తి ఆనందయ్య.ఇతను ఉచితంగా కరోనాకు మందు కనిపెట్టి ఇస్తానంటే మాత్రం రోజులను ఐస్ ముక్కలా కరిగించేస్తున్నారు.ఎలాగో వ్యాక్సిన్స్ అందరికి అందవు.

అందులో వాటి మీద వందల కోట్లు ఖర్చు చేయాలి.వాటిలోను అవినీతికి పాల్పడేవారు కూడా ఉన్నారు.

Advertisement

ఈలోపల ఆనందయ్యను భయపెట్టడం, మరేదైన చేయడం జరిగితే దీనికి బాధ్యులు ఎవరో?.ఇకపోతే ఆనందయ్య కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ కమిషనర్ రాములు స్పందించారు.ఈ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాల్సి ఉందని, అదీగాక ఆనందయ్య ఔషధ పంపిణీకి ముందు ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు