రోడ్‌షోలు, బహిరంగ సభలపై నిషేధం విధించిన ఏపీ ప్రభుత్వం.ఈ ప్లాన్‌తో ప్రతిపక్షాలు జనాల్లోకి వెళ్ళకుండా చేసే ప్రయత్నం చేస్తుంది.
ఎన్నికలకు మరో ఏడాది కాలం ఉండడంతో ఇప్పటి నుండి తన అధికార బలాన్ని వాడుకోవాలని చూస్తుంది. ఇప్పటినుండే అనుకూలమైన పోలీసులకు పోస్టింగ్‌లు ఇస్తున్నారు.
ఇటీవల తీసుకొచ్చిన జిఒని ఉపయోగించి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను ప్రభుత్వం ఎలా భగ్నం చేసేందుకు ప్రయత్నించిందో చూడగలిగాం .చంద్రబాబు దాన్ని ధిక్కరించడంతో నియోజకవర్గంలోని టీడీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కూడా అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.త్వరలో శ్రీకాకుళం పర్యలనకు ఆయన ప్లాన్ చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఏపీ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక ఇప్పటికే ప్రకటించారు.“అనుమతి లేకుండా సమావేశాలు, ర్యాలీలు బహిరంగ సభలు నిషేధించబడ్డాయి.
ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు’ అని ప్రకటించారు.జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో ‘యువశక్తి’ పేరుతో జనసేన పార్టీ బహిరంగ సభను ప్రకటించింది.
నో పర్మిషన్స్ పేరుతో ప్రభుత్వం అడ్డుకునే యోచనలో కనిపిస్తోంది.

ఇక టీడీపీ నేత నారా లోకేష్ ఈ ఏడాది జనవరి 27 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఆయన తన పాదయాత్రను చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించనున్నారు. ఆయన 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు నడవనున్నారు, ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కంటే 352 కిలోమీటర్లు, 59 రోజులు ఎక్కువ అయితే ఈ పాదయాత్రకు అడ్డంకులు ఏర్పాడే అవకాశం ఉంది.
పలు కారణాలతో పాదయాత్ర అంటకాలను వైసీపీ ప్రభుత్వం భావిస్తుందని టీడీపీ నాయకులు అంటున్నారు. చూడాలి 3 నేతల పర్యటలను అడ్డుకట్టు వేసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందో,
.