తీహార్ జైల్లో ఉన్న నిర్భయ నిందితులకు ఉరి శిక్ష పడింది.ఈనెల 16వ తేదీన ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఈ శిక్షను అమలు చేయనున్నారు.2012లో డిసెంబర్ 16న ఢిల్లీలో ఆరుగురు మృగాళ్లు నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారు.నిందితులు చేసిన అఘాయిత్యానికి నిర్భయ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.
నిర్భయం అత్యాచార ఘటన యావత్తు దేశాన్ని కదిలించింది.ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలు ఆందోళనకు దిగారు.దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

నిర్భయ అత్యాచార నిందితులు ప్రస్తుతం దోషులు తిహార్ జైల్లోనే ఉన్నారు.కోర్టు తీర్పుతో వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులు కాగా వీరిలో ఒకరు జూవైనల్ కోర్టు విధించిన శిక్ష అనుభవించాడు.
మరో దోషి రామ్‌సింగ్ జైల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.దిశ హత్యాచారం నేపథ్యంలో మరోసారి నిర్భయ కేసు చర్చానీయాంశమైంది.