ఏమో మళ్లీ కర్ణాటకలో అధికారంలోకి వస్తామేమో అంటూ కాంగ్రెస్ మరీయు జేడీఎస్ ఆశలు పెట్టుకున్నాయి.ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ మోసకారి అంటూ ప్రచారం చేస్తూ ఈ స్థానాలు మావి అంటూ ప్రచారం చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది.
కాని బీజేపీ జోరు ముందు ఈ రెండు పార్టీల సెంటిమెంట్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు.మెజార్టీ స్థానాలను బీజేపీ దక్కించుకోవడం కన్ఫర్మ్ అయ్యింది.
బీజేపీ ప్రభుత్వం సుస్థిరంగా ఉండబోతుంది.
ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూగా ఈ నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగబోతున్నాడు.
కుమార స్వామి మళ్లీ సీఎం అవ్వాలనుకున్నాడు.మరో వైపు కాంగ్రెస్ నుండి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులు తయారు అయ్యారు.
ఇలాంటి సమయంలో బీజేపీకి ఆ అసెంబ్లీ స్థానాల ఓటర్లు పట్టం కట్టారు.ఈ విషయమై ఎలాంటి అనుమానం లేదంటూ కన్నడ ఓటర్లు పూర్తి మెజార్టీని బీజేపీకి ఇవ్వడంతో కాంగ్రెస్ మరియు జేడీఎస్‌లు వెయిట్ చేయక తప్పదు.
కాంగ్రెస్‌కు రెండు స్థానాలు దక్కినా జేడీఎస్‌కు మాత్రం ఒక్కటి కూడా దక్కక పోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.