బీజేపీ ఒక క్రమ పద్దతిలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోల్చి అధికారాన్ని చేజిక్కించుకుంటున్న టైమ్ లో బిహార్ లో గట్టి షాక్ తగిలింది.తమ ప్లాన్ ముందే తెలిసి నితీశ్ కుమార్ ఇలా చేశాడనే వాదన ఉంది.
బీజేపీ కూలదోల్చడానికి ప్లాన్ వేస్తోందనే వార్తలు వినిపించిన నేపథ్యంలో నితీశ్ వారి స్టైల్ లోనే ఇలా చేయడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. మోడీ షాలను తనదైన శైలిలో కట్టడి చేసిన నితీవ్ ప్రస్తుతం హీరో అయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు.
అసెంబ్లీలోని సీట్లలో కేవలం 20 శాతానికి కాస్త ఎక్కువగా మాత్రమే ఉన్న సీట్లతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటం అంత తేలిక కాదు.నరేంద్ర మోడీ లాంటి నేతకు తమ పార్టీకి చెందిన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకోవటానికి వీల్లేని విధంగా.తనను మాత్రమే ముఖ్యమంత్రిని చేయాలన్న ఆప్షన్ తప్పించి మరేమీ లేకుండా చేసిన నితీశ్ కుమార్ ని తక్కువ అంచనా వేయలేం అంటున్నారు.
మోడీషాలకు ఎదురు దెబ్బ…
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో వరుస పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల్ని కూలుస్తూ వస్తున్న వేళ.మోడీ షాలకు షాక్ ఇస్తూ అధికారాన్ని చేజిక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదంటున్నారు.బిహార్ లో ముఖ్యమంత్రిగా ఉన్న తమ మిత్రుడు నితీశ్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నదంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన తీరు అందరికీ తెలిసిందే.అదే ప్లాన్ బిహార్ అధికారపక్షమైన జేడీయూలోఅసమ్మతి నేత ఆర్సీపీ సింగ్ సాయంతో పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నినట్లుగా ఆరోపణలు రావటం.
అదే సమయంలో తమకు ఏ మాత్రం సారూప్యత లేని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా.బీజేపీకి గుడ్ బై చెప్పేసిన తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తనను దెబ్బేసేందుకు మోడీషాలు పావులు కదుపుతుంటే ఆ విషయాన్ని ముందే గ్రహించి తిరిగి దెబ్బతీసిన తీరుకు నితీశ్ ని ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతానికి నితీశ్ ను రాజకీయ అవకాశవాదిగా ముద్ర వేయొచ్చు.కానీ.దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్నదేమిటి.? వాళ్లు చేస్తే తప్పులేనిది.అరకొర బలం ఉన్న ఒక పార్టీకి చెందిన ముఖ్యమంత్రి తెలివిగా మోడీషాలాంటి వారినే దెబ్బ కొట్టటం తప్పేంటని కూడా అంటున్నారు.
మోడీషా వంటి బలమైన నేతల్ని దెబ్బ కొట్టడంలో సక్సెస్ అయిన నితీశ్ హీరో అయ్యాడనడంలో సందేహం లేదు.పలు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తూ అధికారంలోకి వస్తున్న బీజేపీకి వారి పద్దతిలోనే నితీశ్ చెక్ పెట్టడం విశేషం.