అన్నయ్యకు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్న నిహారిక.. వీడియో వైరల్!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాము.ఈ రాఖీ పండుగ రోజు పెద్ద ఎత్తున అక్క చెల్లెలు వారి సోదరులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు.

 Niharika Tied Rakhi To Elder Brother And Took Blessings Video Viral , Niharika ,-TeluguStop.com

ఈ క్రమంలోనే సెలబ్రిటీల సైతం పెద్ద ఎత్తున ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.తాజాగా మెగా డాటర్ నిహారిక సైతం తన అన్నయ్య వరుణ్ తేజ్ కి రాఖీ కట్టి తనకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన అన్నయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు.

ఈ విధంగా నిహారిక రాఖీ పండుగను జరుపుకున్న ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.ఇకపోతే మెగా కుటుంబంలో ఈ విధమైనటువంటి పండుగలు ప్రత్యేక రోజులు జరుపుకోవడంలో ముందు ఉంటారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సోదరీమణులు సైతం వారికి రాఖీ కటింగ్ ఈ పండుగను ప్రతి ఏడాది సెలబ్రేట్ చేసుకుంటారు.ఈ క్రమంలోనే నిహారిక సైతం తన అన్నయ్యకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

నిహారిక విషయానికి వస్తే జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు.ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారడమే కాకుండా, నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ మధ్యకాలంలో నిహారిక వ్యవహారం వల్ల పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలు నిలిచారు.అయితే ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి నిహారికను నెటిజన్ లను టార్గెట్ చేస్తూ ఆమె ఏ పోస్ట్ చేసినా కూడా నెగిటివ్ కామెంట్లతో ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉంటారు.

అయితే మెగా డాటర్ మాత్రం డోంట్ కేర్ అంటూ తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube