న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమోపై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు

అమెరికాలో ప్రముఖ నేతగా వున్న న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమోపై మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.ఆయన వద్ద గతంలో హెల్త్ అడ్వైజర్‌గా పనిచేసిన ఓ యువతి తాజాగా ఆరోపణలు చేశారు.

 New York Governor Accused Of Sexual Harassment By Second Woman, Andrew Cuomo, Ne-TeluguStop.com

షార్లెట్ బెన్నెట్ అనే 25 ఏళ్ల మాజీ ఉద్యోగి 2020లో తనను గవర్నర్ లైంగికంగా వేధించాడని న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.ఆండ్రూ క్యూమో గతేడాది జూన్‌లో తన ముందు డేటింగ్ ప్రతిపాదన తీసుకొచ్చాడని వెల్లడించింది.

వయసులో తేడా దృష్ట్యా శృంగార సంబంధాలు నీకు ఇష్టమేనా అని క్యూమో తనను అడిగారని.అయితే గవర్నర్ తనతో కలిసి నిద్రపోవాలని భావిస్తున్నట్లు తనకు అర్థమైందని ఆమె చెప్పారు.

దీంతో తాను అసౌకర్యానికి గురవ్వడంతో పాటు భయపడ్డానని బెన్నెట్ న్యూయార్క్ టైమ్స్‌కు వివరించారు.ఆ తర్వాత తాను క్యూమో చీఫ్ ఆఫ్ స్టాఫ్, లీగల్ కౌన్సిల్‌ను ఒప్పించి మరొక బిల్డింగ్‌లో వున్న ఉద్యోగానికి బదిలీ చేయించుకున్నానని తెలిపింది.

ఈ పోస్ట్‌‌లో తాను ఎంతో సంతోషంగా వుండటంతో తనపై గవర్నర్ చేసిన లైంగిక వేధింపుల విషయంపై దర్యాప్తు కోరకూడదని నిర్ణయించుకున్నట్లు బెన్నెట్ వెల్లడించింది.

Telugu Andrew Cuomo, Lindsay Boylan-Telugu NRI

అయితే ఈ ఆరోపణలపై స్పందించారు గవర్నర్ క్యూమో.తాను బెన్నెట్‌ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదని, అలాగే ఆమెతో తప్పుగా ప్రవర్తించలేదని ఆయన స్పష్టం చేశారు.కాగా ఆండ్రూ క్యూమో పదవి కాలం 2022తో ముగియనుంది.

ఈ లైంగిక వేధింపులపై మాజీ ఫెడరల్ న్యాయమూర్తితో రివ్యూకు ఆదేశించారు గవర్నర్.న్యూయార్క్ వాసులందరూ రివ్యూ ఫలితాల కోసం ఎదురుచూడాలని క్యూమో కోరారు.

కాగా పదేళ్లుగా న్యూయార్క్‌కు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఈ వారంలో ఇది రెండోసారి.గత బుధవారం .2015 నుంచి 2018 వరకు క్యూమో వద్ద సలహాదారుగా పనిచేసిన లిండ్సే బొయ్లాన్ సైతం ఇదే రకమైన ఆరోపణలు చేశారు.తన పెదవులపై గవర్నర్ బలవంతంగా ముద్దు పెట్టాడని 36 ఏళ్ల బొయ్లాన్ ఆరోపించారు.

స్ట్రిప్ పోకర్ ఆడదామని చెప్పి తనను వెనుక నుంచి తాకేందుకు ప్రయత్నించాడని ఆమె వ్యాఖ్యానించారు.అంతేకాకుండా క్యూమో వద్ద పనిచేయాలని భావిస్తున్న వారు తన కథ చదవాలంటూ సంచలన ట్వీట్ చేశారు.

అయితే ఈ ఆరోపణలను గవర్నర్ కార్యాలయం ఖండించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube