ఉత్తర అమెరికా తెలుగు సంఘం అయిన నాట్స్ డల్లాస్ లో భారీ స్థాయిలో తెలుగు సంబరాలని నిర్వహించబోతోంది.అందుకు తగ్గట్టుగా తేదీలని ప్రకటించింది.
మే నెల 24 నుంచీ 26 వరకూ ఈ సంబరాలు జరుగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది.అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరికి ఆహ్వానం తెలిపింది.
అమెరికాలో నాట్స్ తెలుగుదనం ఉట్టిపడేలా, తెలుగు వెలుగుని కాపాడుకునేలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది.ఈ క్రమమలోనే డల్లాస్ మెట్రోలోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో తెలుగు సంబరాలని ఏర్పాటు చేసింది.
మన తెలుగు సంస్కృతీ, సాంప్రదాయాలకి అద్దంపట్టే విధంగా వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో , తెలుగు వంటకాలు ఆటా పాటలతో అలరించడానికి సిద్దం అయ్యింది.బాషే రమ్యం – సేవే గమ్యం అంటూ తెలుగు వారందరికి ఈ సంబరాలకి ఆహ్వానం పలుకుతోంది.