నరేష్ -పవిత్ర( Naresh Pavitra Lokesh ) కలసి నటించిన తెలుగు -కన్నడ ద్విభాషా చిత్రం ‘మళ్లీ పెళ్లి .( Malli Pelli Movie ) ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి సంచలనం సృష్టిస్తోంది.
ఎమ్‌ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వనితా విజయకుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా టీజర్ , ట్రైలర్ అన్ని కూడా నరేష్ -పవిత్ర నిజ జీవితాల్లో జరిగిన ఘటనలని పోలి ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి .ఇక శుక్రవారం సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి.ఇంతలో సీన్ లోకి నరేష్ వైఫ్ రమ్య రఘుపతి( Ramya Raghupati ) వచ్చేసింది.
మళ్ళీ పెళ్లి మూవీ విడుదలకు వెంటనే ఆపేయాలంటూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టుకు వెళ్లిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.
తన ప్రతిష్ట ను కించ పరిచేలా మళ్ళీ పెళ్లి సినిమా ఉందని, వెంటనే ఈ సినిమా విడుదల ఆపాలి అంటూ పిటిషన్ వేసింది.
దీంతో నరేష్- పవిత్ర లోకేష్- రమ్య రఘుపతి నడుమ నడుస్తున్న వ్యవహారాలు మరోసారి హాట్ ఇష్యూ అయ్యాయి.
నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి అనేది సోషల్ మీడియాలో నెవర్ ఎండింగ్ టాపిక్ అయింది.ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన ఇష్యూస్ లో ఇదొకటి.
సరిగ్గా ఈ తరుణంలో ఆ ఇద్దరే మళ్ళీ పెళ్లి అనే సినిమా చేయడం ఆసక్తికరం.పవిత్ర లోకేష్‌తో కలిసి నరేష్ సహజీవనం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతుండగా.
ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి సినిమా కంప్లీట్ చేశారు.
ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సడెన్ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది.విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నరేష్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారట.
ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం.సురేష్ బొమ్మిలి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నరేష్, పవిత్ర లోకేష్ లీడ్ రోల్స్ పోషించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ అంచనాలు పెంచేశాయి.సిచుయేషన్ క్యాచ్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.రీసెంట్ గా వదిలిన ఈ మూవీ టీజర్ లో పవిత్రను నరేష్ లిప్ కిస్ చేసిన సీన్ కూడా ఉండటంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగింది.నరేష్ జీవితంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలతో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ఈ టీజర్ ద్వారా ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.
మరి ఇప్పుడు మూడో భార్య రంగంలోకి దిగడంతో ఏమి జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది .