అంటే సుందరానికి... నాని కెరీర్‌ లో చాలా స్పెషల్‌

నాని హీరో గా నజ్రియా హీరోయిన్ గా రూపొందిన అంటే సుందరానికి సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఈ వారంలో విడుదల కాబోతున్న అంటే సుందరానికి సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

 Nani Nazriya Movie Ante Sundaraniki Talks , Ante Sundaraniki , Flim News, Nani,-TeluguStop.com

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ని వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు అని ట్రైలర్‌ మరియు టీజర్ లను చూస్తుంటే అనిపిస్తుంది.ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించిన నాని ఈ సినిమా లోని సుందరం పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది.

నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటించి మెప్పించిన నాని ఇప్పుడు ఈ సినిమా లో చాలా కొత్తగా కనిపిస్తాడట.కామెడీని పండించడం మాత్రమే కాకుండా చాలా సర్‌ ప్రైజ్ చేస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు అంటే సుందరానికి సినిమాకు సంబంధించి విడుదల అయిన ప్రమోషనల్‌ వీడియోల్లో ఎక్కడ కూడా నాని ని విభిన్నంగా కనిపించకుండా చూపించలేదు.

కాని ట్రైలర్‌ లో టీజర్ లో చూపించినట్లుగా కాకుండా సినిమా లో చాలా విభిన్నంగా నాని కనిపిస్తాడు అంటూ హామీ ఇస్తున్నారు.

సినిమాకు ఇప్పటి వరకు దక్కిన బజ్ తో పోల్చితే ముందు ముందు ఖచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.ఈ సినిమా తో నజ్రియా తెలుగు లో మొదటి సారి అడుగు పెట్టబోతుంది.

ఇప్పటికే పలు డబ్బింగ్‌ సినిమా లతో అలరించిన ఈ అమ్మడు మొదటి సారి తెలుగు సినిమా నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా అనేది ఈ నెల 10వ తారీకున క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

నాని ఈ సినిమా తర్వాత దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube