అవకాశం ఇస్తామంటే గుడ్డిగా నమ్మి వెళ్ళకూడదు... అలా వెళితే...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీలో ప్రసారమయ్యే “నాలుగు స్తంభాలాట” అనే ధారావాహిక ద్వారా బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీరియల్ నటి “సునీత” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటి సునీత కేవలం సీరియళ్లలో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించింది.

 Nalugu Stambalata Serial Fame Suneetha Sensational Comments On Casting Couch, Na-TeluguStop.com

కానీ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లభించ లేదు.కానీ సీరియల్ ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.

కాగా ఇటీవలే నటి సునీత ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని సీరియల్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ప్రభావం ఎలా ఉందనే విషయంపై స్పందించింది.

ఇందులో భాగంగా క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సీరియల్, సినిమా ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా ఇతర రంగాలలో కూడా ఉందని, కానీ నటన రంగంలోని వ్యక్తులు బాహ్య ప్రపంచానికి బాగానే తెలిసిన వాళ్ళు కావడంతో ఎక్కువగా ఈ విషయం వైరల్ అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

దీనికితోడు నటనా రంగంలో పని చేసేటువంటి ఆర్టిస్టులు గానీ లేదా ఇతర టెక్నీషియన్లపై బాహ్య ప్రపంచంలో లేనిపోని అపోహలు ఉంటాయని అందువల్ల తాము రాత్రిళ్లు ఇంటికి లేటుగా వచ్చినా లేదా మరొకరితో కొంతమేర చనువుగా ఉన్నా సరే లేనిపోని కథలు అల్లేస్తూ ప్రచారాలు చేస్తుంటారని ఇలాంటివి తన జీవితంలో కూడా చాలానే జరిగాయని చెప్పుకొచ్చింది.

అలాగే కొత్తగా సినిమా పరిశ్రమకి వచ్చే నూతన నటీనటులకు కొన్ని సూచనలు, సలహాలను కూడా ఇచ్చింది.

ఇందులో భాగంగా సినిమా అవకాశం ఇస్తామని ఎవరైనా ఫోన్ చేస్తే కొన్ని విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలని తెలిపింది.ఇందులో ముఖ్యంగా అవకాశం వచ్చిన వెంటనే గుడ్డిగా వారు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్లి పోకూడదని ముందుగా డైరెక్టర్ పేరు, బ్యానర్ పేరు, అలాగే షూటింగ్ స్పాట్ వివరాలు వంటివి కనుక్కున్న తర్వాతే అవకాశం విషయంలో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

అలాగే ఈ మధ్య కాలంలో కొందరు హీరోయిన్ లేదా సెకండ్ హీరోయిన్ వంటి ఛాన్సులు ఇస్తామని మోసం చేస్తున్నారని కాబట్టి ఇలాంటి పాత్రల అవకాశాలు వచ్చినప్పుడు ఆ పాత్రలకి మనం సూటమవుతామా లేదా అనే విషయాన్ని కూడా గమనించాలని సూచించింది.సినిమా అనేది రంగుల ప్రపంచమని ఇక్కడ రాణించాలంటే నటనా ప్రతిభతో పాటు మనుషులతో ఎలా ప్రవర్తించాలనే విషయంపై కూడా పూర్తిగా అవగాహన ఉండాలని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube