అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.తాజాగా ఈయన దూత ( Dootha ) అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సిరీస్ ద్వారా ఈయన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ మధ్యకాలంలో నాగచైతన్య నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా చేదు అనుభవాలను మిగులుస్తున్నప్పటికీ దూత సిరీస్ మాత్రం కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పాలి.
ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతుంది.ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా అమెజాన్ ప్రైమ్ వారు నాగచైతన్యకు సంబంధించినటువంటి ఒక వీడియోని విడుదల చేశారు.ఇందులో భాగంగా నాగచైతన్య తన కెరియర్ గురించి తన తాతయ్య నాగేశ్వరరావు ( Nageswararao ) తన చిన్నప్పుడు చెప్పినటువంటి మాటలే నిజమయ్యాయి అంటూ తెలియచేశారు.చిన్నప్పుడు నాగచైతన్యను ఎవరైనా పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే ఈయన మాత్రం ఇంజనీర్ ( Engineer ) అవుతానని సమాధానం చెప్పేవారట.
ఇలా నాగచైతన్య తాను ఇంజనీర్ అవుతానని చెప్పిన ప్రతిసారి నాగేశ్వరరావు మాత్రం లేదు నా మనవడు తనలాగే నటుడు అవుతాడు అంటూ గొప్పగా చెప్పుకునే వారు.అయితే నాగచైతన్య పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ కాకుండా తన తాతయ్యల నటుడుగా ఇండస్ట్రీలోకి వచ్చారు.ఇలా తన కెరియర్ విషయంలో చిన్నప్పుడు తన తాతయ్య చెప్పిన జ్యోస్యమే నిజమైంది అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే చందు మొండేటి దర్శకత్వంలో ఈయన తండేల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది.