2021 లో లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య కు( Naga Chaitanya ) సరైన హిట్టు లేదనే చెప్పాలి.ఈ సినిమా కూడా యావరేజ్ గానే నడిచింది.
నిజంగా ఒక మాటలో చెప్పాలంటే నాగ చైతన్య కి సాలిడ్ హిట్టు పడి ఐదేళ్లవుతుంది.మజిలీ సినిమా( Majili Movie ) తర్వాత అతను నటించిన సినిమా ఏది ఆ రేంజ్ లో వర్కౌట్ అవలేదు.
నా క్రెడిట్ మొత్తం సాయి పల్లవి కే దక్కింది.సోలోగా హిట్ కొట్టి ఇన్నేళ్లు అవుతున్న నాగచైతన్య కెరియర్ అలా కొనసాగుతూనే ఉంది వెంకీ మామ, బంగార్రాజు వంటి సినిమాలు పర్వాలేదనిపించినా ఆ రెండు కూడా నాగ చైతన్య కు సోలో సినిమాలు కాదు వెంకీ మామ లో వెంకటేష్ సపోర్ట్ దక్కితే, బంగార్రాజులో తండ్రి నాగార్జున సపోర్ట్ తో సినిమా విజయవంతమయ్యాయి.

మజిలీ సినిమా విజయం తర్వాత ఒహ్ బేబీ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు నాగ చైతన్య.ఆ తర్వాత వెంకీ మామతో( Venky Mama ) మామ అల్లుళ్లు బాక్సాఫీస్ వద్ద సందడి చేసి మంచి హిట్ కొట్టారు.ఇక ఆ తర్వాత లవ్ స్టోరీ సినిమా( Love Story Movie ) పూర్తిగా సాయి పల్లవి ఖాతాలోకి చేరడంతో ఆ చిత్రం ఒక యావరేజ్ సినిమా గానే మిగిలిపోయింది.ఇక లవ్ స్టోరీ సినిమా తర్వాత థాంక్యూ( Thank You Movie ) అనే చిత్రంలో నటించిన అది బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
తెలుగులో ఎలాగో మంచి సినిమాలు పడటం లేదని హిందీలో కూడా ప్రయత్నించాడు నాగ చైతన్య.లాల్ సింగ్ చెడ్డ తో అమీర్ ఖాన్ సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు కానీ ఈ సినిమా కూడా నాగచైతన్యకు కలిసి రాలేదు.

మళ్లీ గోడకు కొట్టిన బంతిలాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకే దగ్గర అయ్యి కస్టడీ( Custody Movie ) అనే సినిమా చేసిన ఆ సినిమా ఒక రోజు కూడా థియేటర్లో నిలవలేదంటే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.కస్టడీ సినిమా 2023లోనే విడుదలైంది ఇక ఇప్పుడు కొత్త లుక్ లో సరికొత్త ఉత్తేజతో నాగచైతన్య మరోసారి తనకు విజయాన్ని ఇచ్చిన చందు మొండేటితో( Chandoo Mondeti ) మరో సినిమా చేయబోతున్నాడు.ఈ కాంబినేషన్లో ఇంతకుముందే ప్రేమ మరియు సవ్యసాచి సినిమాలు రాగా అందులో ప్రేమ మంచి విజయాన్ని సాధించింది అలాగే సవ్యసాచి బోల్తా కొట్టింది మరి ఈ చిత్రం వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా వస్తుండగా మంచి విజయం దక్కాలని నాగచైతన్య అభిమానులు కోరుకుంటున్నారు.