టాలీవుడ్ కామెడీ హీరోగా అల్లరి నరేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే.కేవలం కామెడీతో సక్సెస్ నెట్టుకురావడం వీలుకాదని తెలిసిన అల్లరి నరేష్, కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు.
అడపాదడపా సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేస్తుండటంతో ఇక సీరియస్ మోడ్‌లోకి వెళ్లి ‘నాంది’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ అల్లరోడు.రిమాండ్‌లో ఉన్న ఖైదీకి ఎలాంటి అన్యాయం జరుగిందనే అంశంతో ఈ సినిమా కథను దర్శకుడు విజయ్ కనకమేడల అద్భుతంగా తెరకెక్కించాడు.
ఈ సినిమాకు రిలీజ్ రోజునే పాజిటివ్ మార్కులు పడటం, అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.ఇక ఈ సినిమాకు కలెక్షన్లు కూడా క్రమంగా పెరుగుతూ రావడంతో ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది.ఇక ఈ సినిమా 6 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.3.29 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించింది.ఈ సినిమాలో అల్లరి నరేష్‌తో పాటు నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సినిమాను జనం మళ్లీ మళ్లీ చూస్తున్నారు.
విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న ప్రొడ్యూస్ చేయడం విశేషం.కాగా ఏరియాలవారీగా ఈ సినిమా 6 రోజుల కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 1.30 కోట్లు
సీడెడ్ – 42 లక్షలు
వైజాగ్ – 30 లక్షలు
తూర్పు – 24 లక్షలు
పశ్చిమ – 18 లక్షలు
కృష్ణ – 27 లక్షలు
గుంటూరు – 26 లక్షలు
నెల్లూరు – 15 లక్షలు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.3.12 కోట్లు షేర్
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 7 లక్షలు
ఓవర్సీస్ – 10 లక్షలు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.3.29కోట్లు