కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పని చేస్తారు.వారి పనికి వారు ప్రశంసలు కూడా ఎప్పుడో ఒకనాడు కచ్చితంగా అందుకుంటారు.
ఇటువంటి ప్రశంసనీయ ఘటనే ముంబైలో చోటుచేసుకుంది.ఆ వివరాలు తెలుసుకుందాం.
నైరుతి రుతుపవనాలు వల్ల ముంబైలో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే! కొన్ని ప్రాంతాల్లో అయితే అడుగు తీసి అడుగు పెట్టలేని దుస్థితి ఏర్పడింది.రోడ్లన్ని జలమయ్యాయి.
అత్యవసరమైతేనే బయటకు రావాలని అక్కడి ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక చేసింది.ఈ నేపథ్యంలో బివాండి– నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ సువిధ చౌహాన్ తన పరిధిలోని పారిశుధ్య పనులను పరిశీలించడానికి వెళ్లారు.
ఈ సందర్భంలో ఆమె మ్యాన్హోల్లోకి దిగారు.నిచ్చెన వేసుకుని మ్యాన్‌హోల్ లోపలికి వెళ్లి అక్కడ పరిశుభ్రత ఎలా ఉందో.
పనులు ఎలా జరుగుతున్నాయో? ఆమె పరిశీలించారు.పైగా ఆ సమయంలో ఆమె చీరలో ఉంది.
కొద్దిసేపటికి బయటకు వచ్చిన ఆమె సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
డ్యూటీపై ఆమె అంకితభావాన్ని నెటిజెన్లు తెగ పొగిడేస్తున్నారు.నెటిజెన్లు ఈ వీడియోపై స్పందిస్తూ తెగ పోస్టులు పెడుతున్నారు.
ఇటువంటి అధికారులు ఇంకొంత మంది ఉంటే… దేశానికి ఏ ఇబ్బందులు రావని కామెంట్స్ పెడుతున్నారు.
పవర్లూమ్ అనే కంపెనీకి మున్సిపల్ పనులను కాంట్రాక్టు ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఆమెకు ఈ డ్యూటీని కేటాయించారని.పనులన్ని సరిగ్గా జరుగుతున్నాయో? లేదో? చూసుకోవడం తన బాధ్యతని చౌహాన్ తెలిపారు.మ్యాన్‌హోల్ క్లీన్ చేయడం చాలా కష్టతరం.అందులోనూ వరద కూడా వస్తోంది.

మ్యాన్‌హోల్‌లో దిగినపుడు తనకు ఏ భయం వేయలేదని అధికారి చెప్పుకొచ్చారు.తన పైస్థాయి అధికారులు.కుటుంబ సభ్యులు కూడా ఈ పనికి ప్రశంసిస్తున్నారని ఆమె అన్నారు.నైరుతి రుతుపవనాల రాకతో మూడు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి.ఈ కారణంగా కరోనా సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది.దీంతో ఇప్పుడిప్పుడే కరోనా కష్టాల నుంచి కోలుకుంటున్న ముంబై నగరానికి వర్షపు కష్టాలు వచ్చాయి.
మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముంబై కార్పొరేషన్ మరింత అప్రమత్తమైంది.ప్రజలను ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు రావాలని ఆదేశించింది.