భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ( Mahendra Singh Dhoni ) గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ధోని ఇప్పుడంటే కోటానుకోట్ల సంపాదిస్తున్నాడు గానీ, ఒకప్పుడు అందరి మాదిరి నెల జీతానికే పని చేసేవాడని మీలో ఎంతమందికి తెలుసు? అవును, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ హెడ్, లలిత్ మోదీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ పాత అపాయింట్‌మెంట్ లెటర్( Job Appointment Letter ) ఒకదానిని తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా షేర్ చేశారు.సదరు లేఖని పరిశీలిస్తే, జూలై 2012లో ధోనీకి వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు.11ఏళ్ల క్రితం అతడి జాబ్ అపాయింట్‌మెంట్ లెటర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధోనీ ఇండియా సిమెంట్స్( India Cements ) మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా అప్పట్లో నియమితుడయ్యాడు.అందుకుగానూ ఆయన నెలకు 43 వేల జీతం అందుకునే వాడు.ఆయా విషయాలు ఆ లెటర్‌లో వున్నాయి.అంతేకాదండోయ్.ఫిక్స్‌డ్ అలవెన్స్‌లు కూడా ఉన్నాయి.ఇకపోతే దేశానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలో బీసీసీఐ కాంట్రాక్ట్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న క్రికెటర్‌గా ధోని రికార్డుల కెక్కిన విషయం విదితమే.
ఆటను మినహాయిస్తే అడ్వర్టైజ్‌మెంట్స్, ఎండార్స్‌మెంట్ల రూపంలో వద్దన్నా మనోడికి కోట్లు వచ్చి పడేవి.అలాంటి ధోని క్రికెట్‌లోకి రాకముందు రైల్వే శాఖలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌గా( TTE ) విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
నెలజీతంతో పాటు అదనంగా మనోడికి స్పెషల్ పే కింద రూ 20వేలు, ఫిక్స్‌డ్ అలెవెన్స్ కింద మరో రూ.21,970 ఇస్తున్నట్టు ఆ లెటర్ లో మనం గమనించవచ్చు.హౌస్ రెంటల్ అలెవెన్స్ కింద రూ.20,400.స్పెషల్ హౌస్ రెంట్ అలెవెన్స్ కింద మరో రూ.8,400.ఏ బెనిఫిట్స్ లేని స్పెషల్ అలెవెన్స్ కింద రూ.60వేలు, న్యూస్‌పేపర్ ఖర్చుల కింద రూ.175 ఇవ్వనున్నట్లు లెటర్‌లో మనం చూడవచ్చు.మొత్తంగా వైస్ ప్రెసిడెంట్ హోదాలో ధోని సుమారు రూ.
లక్షా 60వేలకు పైగా నెలజీతం రూపంలో అప్పట్లో అందుకునేవాడన్నమాట.ఇక ఈ లెటర్‌ను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ( Lalit Modi ) తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది.