సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో ఇలియానా, తమన్నా( Ileana, Tamannaah ) పేర్లు కచ్చితంగా ఉంటుంది.‘దేవదాసు’( Devadasu ) సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా, ఆ తర్వాత పోకిరి, జల్సా, కిక్ మొదలుగు సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగింది.అంతే కాదు , సౌత్ లో కోటి రూపాయిలు తీసుకున్న మొట్టమొదటి హీరోయిన్ గా కూడా ఇలియానా చరిత్ర సృష్టించింది.ఇప్పుడు ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆమెకి యూత్ లో క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.
కానీ సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులకు ఎల్లప్పుడూ టచ్ లోనే ఉంటుంది.ఈమె తెలుగు లో మాత్రమే కాదు , తమిళం , హిందీ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

ఇక తమన్నా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.మంచు మనోజ్ హీరో గా నటించిన ‘శ్రీ’( Sri ) అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది.అక్కడ కొన్ని సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ‘హ్యాపీ డేస్’( Happy Days ) చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చి , భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని , టాప్ స్టార్ గా దూసుకొచ్చింది.ఇప్పుడు ఆమె పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ స్టార్ హీరోయిన్ గా వెలుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
అలా టాప్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న వీళ్లిద్దరు కలిసి ఒకే సినిమాలో నటించారు అనే విషయం ఎవరికీ ఇప్పటి వరకు తెలియదు.ఆ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా, తమన్నా పూర్తి స్థాయి విలన్ రోల్ లో కనిపించింది.

ఆ చిత్రం పేరు కేడి( KD ). 7/జి బృందావన కాలనీ( 7/G Vrindavan Colony ) హీరో రవికృష్ణ నటించిన ఈ సినిమా అప్పట్లో తమిళం లో పెద్ద హిట్ అయ్యింది.ఇందులో ఇలియానా అమాయకురాలిగా కనిపించగా, తమన్నా పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో కనిపించింది.కానీ క్లైమాక్స్ లో ఆమె క్యారక్టర్ చూసే ప్రతీ ప్రేక్షకుడికి కన్నీళ్లు రప్పిస్తాయి.
ఈ సినిమాని అప్పట్లో తెలుగు లో దబ్ చేసి విడుదల చేద్దాం అనుకున్నారు కానీ, ఎందుకో కుదర్లేదు.అలా ఎవరికీ తెలియకుండా ఉండిపోయిన ఈ చిత్రం అప్పట్లో తమిళం లో రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.
ఈ చిత్రం తర్వాత మళ్ళీ తమన్నా, ఇలియానా కలిసి నటించలేదు.ఇక పోతే ఐలన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండగా , తమన్నా మాత్రం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతుంది.