తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 Mp Vijayasai Reddy Comments On Tarakaratna's Health Condition-TeluguStop.com

తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.ప్రస్తుతం గుండె ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేస్తుందన్న ఆయన మెదడులో వాపు ఏర్పడిందని వైద్యులు తెలిపారని వెల్లడించారు.

తారకరత్న గుండెపోటుకు గురైన రోజు సుమారు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడంతో మెదడు పై భాగం కొద్దిగా దెబ్బతిన్నదని తెలిపారు.డాక్టర్లు అద్భుతమైన చికిత్సను అందిస్తున్నారన్న విజయసాయిరెడ్డి నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.

తారకరత్నకు సంబంధించి అన్ని విషయాలను బాలయ్య పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.అయితే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.

విజయసాయిరెడ్డి సతీమణి సునంద చెల్లిలి కూతురన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube