తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్

ఈ నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్

తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.ప్రస్తుతం గుండె ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేస్తుందన్న ఆయన మెదడులో వాపు ఏర్పడిందని వైద్యులు తెలిపారని వెల్లడించారు.

తారకరత్న గుండెపోటుకు గురైన రోజు సుమారు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడంతో మెదడు పై భాగం కొద్దిగా దెబ్బతిన్నదని తెలిపారు.

డాక్టర్లు అద్భుతమైన చికిత్సను అందిస్తున్నారన్న విజయసాయిరెడ్డి నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.తారకరత్నకు సంబంధించి అన్ని విషయాలను బాలయ్య పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.

అయితే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.విజయసాయిరెడ్డి సతీమణి సునంద చెల్లిలి కూతురన్న విషయం తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా.. వేరే లెవెల్ లో ప్లాన్ చేశారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా.. వేరే లెవెల్ లో ప్లాన్ చేశారా?