తప్పు ఎవరు చేసిన శిక్ష అనుభవించక తప్పదు.చట్టం దృష్టిలో అందరు సమానులే అంటారు కానీ కొందరి విషయంలో చట్టాన్ని కూడా చుట్టలా చుట్టేస్తున్న సందర్భాలున్నాయి.
ఇకపోతే మహారాష్ట్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి నవనీత్ కౌర్ రాణా ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.ఇంత వరకు బాగానే ఉన్నా మార్చిలో మహారాష్ట్ర సర్కార్‌కు వ్యతిరేకంగా మాట్లాడి సంచలనం సృష్టించారు.
ఇదిలా ఉండగా నవనీత్ కౌర్ కు బాంబే హైకోర్టు షాకిచ్చింది.

నవనీత్ పై నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల కేసు నమోదైన విషయం తెలిసిందే.కాగా ఆ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసిన హైకోర్టు ఆమెకు రూ.2 లక్షలు జరిమానా విధించింది.ఇకపోతే మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు నవనీత్ కౌర్, ఫేక్ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి, పోటీ చేశారని కోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ విధంగా స్పందించింది.