Bandi Sanjay Vs Ponnam : నన్ను గెలకొద్దు.. ఆ మంత్రికి ‘ బండి ‘ వార్నింగ్

తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్( BJP Bandi Sanjay ) మంత్రి పొన్నం ప్రభాకర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు .అయోధ్య రాముడు విషయంలో కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సంజయ్ వ్యాఖ్యానించారు .ఈరోజు ప్రజా హిత యాత్రలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ.‘ అయోధ్యలో రాముడు( Ayodhya Rama ) జన్మించినట్లు గ్యారెంటీ ఏంటని మీరు ప్రశ్నిస్తే .నీ తల్లికి నువ్వు పుట్టినట్లు గ్యారంటీ ఏంటి అంటే నువ్వెందుకు మేదేసుకుంటున్నావు.  నన్ను అనవసరంగా గెలుకుతున్నారు .నేను శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేపడితే మీకేం వచ్చింది.ఎక్కడా నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు.

 Bandi Sanjay Vs Ponnam : నన్ను గెలకొద్దు.. ఆ మ-TeluguStop.com

Telugu Ayodhya Rama, Bandi Sanjay, Karimnagar Mp, Mpbandi, Revanth Reddy, Telang

మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) కు సవాల్ విసిరుతున్నా.నేను నా విశ్వాసాలతో రాముడు పేరిట ఎన్నికల్లో నిలుచుంటా మీ అభ్యర్థిని నిలబెట్టు.నేను ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను.వ్యాపారం చేసుకుని బతుకుతా .మళ్ళి రాముడిని హిందూ మతం అని మాట్లాడను.ఒకవేళ నువ్వు ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా ? పొన్నం తో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి .మొదటి నుంచి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు.ఇలాంటి అలజడులలో రేవంత్( Revanth Reddy ) ను ఇరికించి ఆయన పదవి కిందకి నీళ్లు తేవచ్చు.

  బీఆర్ఎస్( BRS ) లో కేటీఆర్ , కాంగ్రెస్ లో పొన్నం లో మోపైండ్లు.కేటీఆర్ వాగుడుతో బీఆర్ఎస్ మునిగింది.పొన్నంతో కాంగ్రెస్ మునగాడు కాయం ” అంటూ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Telugu Ayodhya Rama, Bandi Sanjay, Karimnagar Mp, Mpbandi, Revanth Reddy, Telang

బండి సంజయ్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెరలేపారంటూ మండిపడ్డారు.కరీంనగర్( Karimnagar ) పార్లమెంట్ అభివృద్ధికి ఎంపీగా ఏం చేసావో చెప్పి యాత్ర చేయాలని తాను అన్నట్లు తెలిపారు.” రాముడి జన్మంపై నేనెన్నడు మాట్లాడలేదు .నేను అనని మాటను కూడా ఆపాదిస్తూ తల్లి జన్మపై మాట్లాడడం దుర్మార్గం.తల్లి ఎవరికైనా తల్లే.

అలాంటి మాటలు తప్పు .మేము ఎవరూ ఆయన యాత్రను అడ్డుకోవడం లేదు.బండి మాటలను మీరు సమర్థిస్తున్నారా అని నేను బిజెపి అధ్యక్షుడిని అడుగుతున్నా.  కరీంనగర్ అభివృద్ధికి సంబంధించి బహిరంగ చర్చకు నేను సిద్ధం.ఓటమి భయంతోనే బండి ఇలాంటి మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు.హిందూ గాళ్లు , బొందు గాల్లు అని కేసిఆర్ అన్న మాటలను ఎలా రాజకీయంగా వాడుకున్నావో ఇప్పుడు అమ్మ గురించి నువ్వు మాట్లాడిన మాటలతో మీ రాజకీయ జీవితం( Political Life ) అంతరించిపోవడం ఖాయం అంటూ పొన్నం ఫైర్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube