నందమూరి అభిమానులతో పాటుగా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ గ్రాండ్ డెబ్యూ మూవీ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు.ప్రతీ సంవత్సరం ఆయన మొదటి సినిమాకి సంబంధించిన సమాచారం కోసం ఎదురు చూడడం చివరికి నిరాశ చెందడం, నందమూరి ఫ్యాన్స్ కి అలవాటు అయిపోయింది.
కానీ వచ్చే ఏడాది మాత్రం కచ్చితంగా మోక్షజ్ఞ ( Mokshagna Teja )ఎంట్రీ ఉంటుందని బాలయ్య బాబు స్వయంగా చెప్పాడు.మోక్షజ్ఞ జాతకం ప్రకారం కొన్ని దోషాలు ఉండడం వల్లే ఇన్ని ఏళ్ళు అతను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్.
మొదటి సినిమా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా లవ్ స్టోరీ తోనే లాంచ్ చేయించాలని చూస్తున్నాడు బాలయ్య.అనిల్ రావిపూడి కి ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది.
మొదటి సినిమా గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, అప్పుడు రెండవ సినిమా గురించి న్యూస్ వచ్చేసింది.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే, మోక్షజ్ఞ తేజ రెండవ సినిమాకి రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం వహించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.గత కొద్దీ రోజుల క్రితం రాజమౌళి ని కలిసిన బాలయ్య బాబు తన కొడుకుతో ఒక సినిమా చెయ్యాలని కోరడమే కాకుండా, అడ్వాన్స్ కూడా భారీ స్థాయిలోనే ఇచ్చాడట.దానికి రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా చేసుకున్నాడు, ఈ సినిమా పూర్తి అవ్వగానే ఆయన మహాభారతం సిరీస్ ని తెరకెక్కించాలని చూస్తున్నాడు.ఇందులో మోక్షజ్ఞ కి ఎదో ఒక చారిత్రాత్మక పాత్ర ని ఇవ్వొచ్చు అని అనుకుంటున్నారు.
ఇలా చేస్తాడా, లేకపోతే మోక్షజ్ఞ తో సెపెరేట్ గా ఒక సినిమా తీసి , ఆ తర్వాత మహాభారతం తీస్తాడా అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం రాజమౌళి మరియు మోక్ష కాంబినేషన్ కి సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది.

గతం లో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) కూడా ఇదే చేసాడు.ఆయన తనయుడు రామ్ చరణ్ ని చిరుత సినిమా తర్వాత రాజమౌళి చేతిలో పెట్టాడు.అలా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రం ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో మనమంతా చూసాము.రేపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా అదే సక్సెస్ అవుతాడని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు, మరి వారి కోరికలు నెరవేరుతాయా లేదా అనేది వచ్చే ఏడాది తెలిసిపోతుంది.