టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) తీవ్రంగా మండిపడ్డారు.ఏపీకి చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు.
జగన్ పట్ల చంద్రబాబు( Chandrababu ) ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.గాజువాకలో చంద్రబాబే రాళ్ల డ్రామా ఆడారని తెలిపారు.స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు వైఖరి ఏంటో చెప్పలేదన్నారు.తాము అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని మంత్రి గుడివాడ స్పష్టం చేశారు.ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు.ఇకనైనా చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడటం మానుకోవాలని ఆయన హితవు పలికారు.