రాజన్న సిరిసిల్ల జిల్లా :అన్ని దానాలాకన్న గొప్ప దానం రక్తం దానం.ఎల్లారెడ్డిపేట మండల( Yellareddypet ) కేంద్రానికి చెందిన రక్తదాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి 48 సార్లు రక్తదానం( blood donation ) చేసి రికార్డు సాధించారు.
తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులో త్యాగరాయ గాన సభలో మహానంది పురస్కారాన్ని గిరిధర్ రెడ్డి( Giridhar Reddy ) అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ( Saddi Lakshmareddy )ఆధ్వర్యంలో వంగ గిరిధర్ రెడ్డి కి శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యధికంగా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన గిరిధర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ.
అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, నాయకులు పందిర్ల లింగం గౌడ్,వంగ గిరిధర్ రెడ్డి, గుండాడి రాంరెడ్డి , కొత్త పల్లి దేవయ్య, గుర్రపు రాములు, బండారి బాల్ రెడ్డి, గంట బుచ్చ గౌడ్, రాంచందర్ నాయక్, వడ్నాల ఆంజనేయులు, పొన్నాల మల్లారెడ్డి, కంకనాల శ్రీనివాస్,సోషల్ మీడియా ప్రతినిధి భీపేట రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.